TSRTC Mahabubabad 2 Man Fighting Eachother For Seat In Bus: బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పటి నుంచి అనేక వింత ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల బస్సులోసీట్ల కోసం, మహిళలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు. సీటుకోసం, బస్సులో టికెట్ కోసం కోట్టుకొవడం వంటి ఘటనలు ప్రతిరోజు వార్తలలో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బస్సులలోజరుగుతున్న గొడవలకు సంబంధించి అనేక వీడియోలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు మహిళల కోసం ఉచితబస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. దీని కోసం ఆయారాష్ట్రాలలో ఆధార్ కార్డు చూపిస్తే, సంబంధిందిత బార్డర్ వరకు కూడా బస్సులో ఉచిత ప్రయాణసదుపాయం ఇస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇదిలా ఉండగా.. బస్సులో టికెట్ చూపించమంటే కొన్నిసార్లు, మహిళలు కండక్టర్ తో గొడవకు దిగుతుంటారు. మరికొన్ని చోట్ల సీటు కోసం గోడవలకు దిగుతుంటారు. తమ సీట్లో మరో మహిళ కూర్చుంటే గొడవ పడిన సంఘటలను చూశాం. బస్సులో ఆపేస్టాప్ కాకుండా దూరంగా ఆపిన కూడా బస్సులో మహిళలు గొడవలు పడిన ఘటనలు చూశాం. అదే విధంగా తరచుగా బస్సులొ గొడవలకు సంబందించిన ఘటనలు ప్రస్తుతం రోజు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.


పూర్తి వివరాలు..


మహబూబాబాద్ - తొర్రూరుకు వస్తున్న బస్సులు ఊహించని ఘటన చోటు చేసుకుంది. బస్సంతా ఫుల్ గా నిండిపోయింది. దీంతో ఎలాగైన బస్సులో ఎక్కాలని కొందరు కడ్చీఫ్ లు వేసుకుని మరీ చూస్తున్నారు.కొందరు బస్సులో కిటీకిలీ నుంచి , తమ వారి కోసం కడ్చీప్ లు, బ్యాగులు వేసి మరీ సీట్లను ఆపుతుంటారు. కొందరు కిటీకిల నుంచి దూరిపోయి, సీటులో కూర్చుంటు ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం బస్టాండ్ లలో చూస్తుంటా. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారింది.  ఈఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..


మహబూబాబాద్ నుంచి బస్సు బయల్దేరింది. ఈక్రమంలో ఒక వ్యక్తి తన భార్య కోసం కిటీకి నుంచి కడ్చీఫ్ వేశాడు. దీంతో మరో వ్యక్తి వచ్చి అప్పటికే ఆ సీటులో తన భార్యను కూర్చుండబెట్టాడు. సదరు వ్యక్తి వచ్చి, ముందే ఈ సీటులో కడ్చీప్ వేశానని, నువ్వేందుకు కూర్చుంటావంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది.అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆపడానికి చూసిన ఇద్దరు ఒకరిపై మరోకరు దాడులు చేసుకున్నారు. కొందరు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. చివరకు డ్రైవర్, కండక్టర్ రంగంలోకి దిగి ఇద్దరిని సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter