Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..

Breakups Leaves: చాలా మంది యువత తరచుగా లైఫ్ లో ఎవరితోనో ఒకరితో తప్పకుండా లవ్ లో పడతారు. కొంత కాలంపాటు వీరి జర్నీ బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఏవో పర్సనల్ కారణాలతో బ్రేకప్ చెప్పేసుకుంటారు.
 

1 /6

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమీద కల్గుతుందో ఎవరు కూడా చెప్పలేరు. లవ్ అనేది యుక్త వయస్సులో మాత్రమే కల్గాలని రూల్ లేదు. కొందరికి స్యూల్ డేస్, కాలేజ్ డేస్, ఇంటి చుట్టుపక్కల ఉండే వారితో కూడా క్రష్ ఏర్పడవచ్చు. కానీ ఒక మెచుర్డ్ ఆలోచనలు కలిగాక మాత్రమే మనకు కల్గింది..  ప్రేమనా.. లేదా వయస్సు, హర్మోనల్స్ వల్ల వచ్చిన ఆకర్శన మాత్రమేనా  అని తెలిసేది.

2 /6

చాలా మంది యువత ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి మాత్రమే ఎక్కువగా ఆసక్తిచూపిస్తున్నారు. ప్రేమలో కొంత కాలంలోపాటు ఇద్దరు కలిసి జర్నీలు చేస్తారు. దీంతో ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకరితో మరోకరు పంచుకుంటారు. ఈ జర్నీలో నచ్చితే పెళ్లివైపు వెళ్తారు. లేదంటే మాత్రం బ్రేకప్ చెప్పుకుని ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతుంటారు.

3 /6

కొందరు మాత్రం ఎంతో సున్నితంగా ఉంటారు. బ్రేకప్ ను అంత ఈజీగా తీసుకొలేరు. తాము మనస్సుపడ్డ.. అబ్బాయి లేదా అమ్మాయికోసం కుమిలిపోతుంటారు. వారికి పెళ్లైపోయిన అదే ఆలోచనల్లో ఉంటారు. ఎప్పుడు కూడా వారితో గడిపిన సమయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు. ఇలాంటి వారుతమ పనులు చేయడంలో కాస్తంతా వెనుకబడుతుంటారు.  

4 /6

ఇక ఉద్యోగులైతే.. కంపెనీ పనులు చేయడంలో అనేక పొరపాట్లు చేస్తుంటారు. అయితే.. బ్రేకప్ గురించి ఒక  కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్టాక్ గ్రో అనే కంపెనీ రిలేషన్ షిప్ బ్రేకప్, పర్సనల్ సమస్యలతో బాధపడే వారికి ఇష్టమున్నన్నిరోజులు సెలవులు తీసుకొవచ్చని తెలిపింది.

5 /6

కంపెనీ ఎలాంటి ఆధారాలు అడగదని, క్రాస్ ప్రశ్నలు కూడా అడగదని కూడా తెల్చి చెప్పింది. అవసరమైతే సెలవులను మీరు పొడిగించుకొవచ్చని కూడా ఎంప్లాయిస్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులకు హెల్త్ , పర్సనల్ బాగోగులు తమ కంపెనీ చూసుకుంటుందని స్టాక్ గ్రో ఒక ప్రకటనలో వెల్లడించింది.

6 /6

ఈ వార్త వైరల్ కావడంతో వావ్.. భలే కంపెనీ.. సూపర్ ఐడియా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా.. అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం.. స్టాక్ గ్రో కంపెనీ బ్రేకప్‌ లీవ్స్ యాడ్ మాత్రం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x