Road Accident At Hyderabad karimnagar Highway: కొన్నిసార్లు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు నడిపించేటప్పుడు ఇష్టమున్నట్టు డ్రైవింగ్ చేస్తుంటారు. కారు నడిపేటప్పుడు కొందరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. సీటు బెల్టు పెట్టుకుంటారు. తమ మార్గంలో తామే వెళ్తుంటారు.  కానీ కొందరు మాత్రం.. వాహనాలు నడిపేటప్పుడు ఇష్టమున్నట్లు డ్రైవింగ్ చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇలాంటి కొన్ని సందర్భాలలో అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో తరచుగా రోడ్డు ప్రమాద ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. హైవేల మీద వాహనాలను కొందరు ఎక్కువ వేగంతో నడిపిస్తుంటారు.  ఇలాంటి సందర్భాలలో అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు ప్రమాద ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తుంటాయి. తాజాగా, మరో ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..



తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. కారు హైదరాబాద్- కరీంనగర్ రహదారిమీద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు తిమ్మారెడ్డి పల్లి  వద్ద అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ, అవతలివైపుకు పడింది.


Read MOre: Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ అయిందా.. ? చేతిలో ఉన్న‌ది ఆ ఒక్క సినిమా మాత్ర‌మే..


అదే సమయంలో కరీంనగర్ వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు గాల్లో పల్టీలు కొడుతూ, బంతిలాగా ఎగిరి కిందపడింది. మరో కారు చెట్టుకు ఢీకొని ధ్వంసమైంది. ఈ ఘటనలో రెండు కార్లలోని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి చెందని ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook