Gold Saree Crafts Sircilla Weaver: తెలంగాణ చేనేత కళలకు కాణాచిగా వెలుగుతోంది. విశ్వవ్యాప్తంగా తెలంగాణ చీరలు ప్రసిద్ధి చెందాయి. మరోసారి తెలంగాణ చేనేత కళాకారుడు ఔరా అనిపించాడు. ఇన్నాళ్లు కొంగు బంగారం అంటారు.. కానీ ఒక కళాకారుడు చీరనే బంగారంగా చేశాడు. బంగారంతో చీర నేసి అద్భుతం చేశాడు. బంగారు చీరను అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ చీర ధర ఎంత ఉంది? ఎవరు చేశారు? దాని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్‌.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు


 


తెలంగాణలో సిరిసిల్ల చీరలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. సిరిసిల్ల చీరలకు నల్ల పరంధాములు విశ్వ గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన మరణించాక ఆయన కుమారుడు నల్ల విజయ్‌ కుమార్‌ తండ్రి బాటలోనే నడుస్తూ చీరలకు కొత్త సాంకేతికత జోడిస్తూ అద్భుత రీతిలో చీరలను తయారు చేయిస్తున్నారు. సూదిలో.. అగ్గిపెట్టెలో పట్టే చీరలతో గుర్తింపు లభించింది. తాజాగా విజయ్‌ కుమార్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కోసం బంగారంతో చీరను తయారు చేయించాడు.

Also Read: Viral Video: పిల్ల పామును పాప్‌కార్న్‌లా తినేసిన భారీ కట్ల పాము


 


ఆరు నెలల కిందట విజయ్‌ కుమార్‌కు బంగారంతో చీర తయారుచేయాలని వ్యాపారవేత్త ఆర్డర్‌ ఇచ్చాడు. ఆరు నెలలు శ్రమించి ప్రత్యేక జాగ్రత్తలతో బంగారం చీరను నల్ల విజయ్‌ కుమార్‌ తయారుచేశాడు. ఆ చీరకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో లీకయ్యాయి. ఆ చీర 49 ఇంచుల వెడల్పు.. ఐదున్నర అడుగుల పొడవు ఉంది. బంగారు రంగులో చీర మెరుస్తోంది.


చీర బరువు 800 నుంచి 900 గ్రాముల బరువు ఉంది. మొత్తం బంగారం 200 గ్రాములు వినియోగించారు. ఈ చీర తయారీకి రూ.18 లక్షలు ఖర్చయ్యింది. బంగారాన్ని కరిగించి పోగులుగా (దారాలు) చేయడానికి చాలా సమయం పట్టింది. బంగారు నూలు సిద్ధం చేసిన 10-12 రోజుల తర్వాత ఈ బంగారం చీరకు ప్రాణం పోశారు. సిరిసిల్ల చీరకు బంగారంతో ప్రాణం పోసిన నల్ల విజయ్‌ కుమార్‌ పనితనం చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్టోబర్‌ 27వ తేదీన జరిగే పెళ్లి రోజు వ్యాపారవేత్త కుటుంబానికి అప్పగించనున్నారు.


ఈ చీర తయారీపై విజయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. 'ఇలాంటి ప్రత్యేకమైన చీరను నేయడం (తయారు) చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ చీర పూర్తి చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది. అంతేకాకుండా చేనేత కళపై నాకు ఉన్న అభిరుచిని ప్రతిబింబించేలా చేసింది. వ్యాపారవేత్త కుటుంబానికి త్వరలోనే ఈ చీరను అందిస్తా' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.