TGRTC free bus ride woman peeling garlic while travelling video goes viral: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీల పథకం అమలు చేస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసింది. దీనిలో భాగంగా ప్రజలు భారీమెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. ఇదిలా ఉండగా..మహిళల కోసం సీఎం రేవంత్ సర్కారు బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకంను వెంటనే ప్రారంభించింది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయంను ఉపయోగించుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. ఉచిత బస్సు పుణ్యామా.. అని ప్రతిరోజు వింత వింత ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొందరు మహిళలు సీట్లు కోసం గొడవలు పడుతున్నారు. మరికొందరు ఆధార్ కార్డ్ విషయంలో కూడా కండక్టర్ తో గొడవలు పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అవసరం ఉన్నా.. లేక పోయిన కొందరు మహిళలు ఉచిత బస్సు సదుపాయంను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో బస్సులో కొంత మంది చేస్తున్న పనులు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే కొందరు మహిళలు చంటిబిడ్డ ఏడుస్తున్నాడని బస్సులో అన్నం తిన్పించేదుకు జర్నీ చేశారు. మరికొన్ని చోట్ల.. అవసరంలేకున్న కూడా ఏదో బోర్ అవుతుందని బంధువుల ఇంటికి బస్సులో వెళ్తున్నారు. దీంతో ఫ్రీబస్సులో మహిళల నిర్వాకాల ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజగా మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..  



ఉచిత బస్సు జర్నీలను కొందరు మహిళలు మాత్రం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేపోయిన కూడా ఫ్రీ కదా..అని వేరే ఊర్లకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. బస్సులో ఒక మహిళ హన్మకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తుంది. ఆమె ఏంచక్కా వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తుంది. కొందరు ఆమె చేస్తున్న నిర్వాకంను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో అది కాస్తవైరల్ గా మారింది.


Read more: Thai Girl Paratha: రోమాంటిక్ లుక్స్ తో అదరగొడుతున్న పరోటా అమ్మాయి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..


ఒకప్పుడు బస్సులో.. బిస్కట్లు, బటానీలు, స్నాక్స్ లనుతినేవాళ్లు . కానీ  ఇప్పుడు మహిళలు మాత్రం.. తమకు ఇంటి వద్దపని అవ్వడం లేదని కూడా బస్సుల్లో జర్నీ చేస్తు టైమ్ పాస్ చేస్తున్నారు. సదరు మహిళ వెల్లుల్లి పోట్టులను తీరిగ్గా తీసుకుంటుంది.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇదేంది నాయన ఫ్రీబస్సు సదుపాయాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటారా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి