Temple Thieves: దేవుడంటే అందరికీ భక్తి.. విశ్వాసం ఉంటారు. అందరూ పూజిస్తారు.. కానీ దొంగలు మాత్రం దేవుడిని కూడా వదలడం లేదు. భక్తి చాటున దొంగతనాలకు పాల్పడుతూ దేవుడినే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆలయం కనిపిస్తే చాలు ఉదయం కల్లా దొంగతనం చేసేస్తారు. అలాంటి వెరైటీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగల నుంచి భారీగా దేవుడికి సంబంధించిన నగలు.. ఆలయ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీసుల వివరాల ప్రకారం..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Friends Stabbed: ప్రాణం తీసిన 'మొబైల్‌ ఫోన్‌' పార్టీ.. దావత్‌ ఇవ్వలేదని తోటి స్నేహితులే


 


శ్రీకాకుళం జిల్లా పోలీసులు వరుసగా ఆలయాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక దర్యాప్తు చేపట్టి గాలిస్తున్న క్రమంలో ఐదుగురు దొంగలు పోలీసులకు చిక్కారు. దొంగల అరెస్ట్‌ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు. 'అరెస్టయిన ఐదుగురు దొంగలపై 2021 నుంచి 39 కేసులు నమోదయ్యాయి. దేవాలయాలు, రైస్ మిల్లులు లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. ఆయా కేసులలో సుమారు 91.38 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నాం' అని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Also Read: Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్‌.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు


 


ఈ కేసుల్లో మరో నలుగురు దొంగలు కోనసీమ జిల్లాలో పట్టుబడ్డారు. వారి నుంచి ఒక కారును స్వాదీనం చేసుకున్నారు. అయితే ఈ దొంగలు చోరీ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. సీసీ కెమెరాలు లేని దేవాలయాలనే ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ దొంగలందూర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, ఎల్‌ఎన్ పేట, హిర మండలానికి చెందిన వారు కాగా.. మరో దొంగ తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నారు.


స్వాధీనం చేసుకున్న సొత్తు
692 గ్రాముల  బంగారు ఆభరణాలు, 52.880 కిలోల వెండి ఆభరణాలు, సుమారు రూ.మూడున్నర లక్షల నగదు, 4 మోటార్ బైక్‌లు. వాటి మొత్తం విలువ రూ.91.38 లక్షలు ఉంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.