Man Married Himself | ఈ వార్త కాస్త నమ్మడానికి వీల్లేకుండా.. కొత్తగా ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ నిజం. 33 సంవత్సరాల ఒక వ్యక్తి తనను తానే పెళ్లి ( Brazilian Man Married Himself ) చేసుకున్నాడు. మరి ఇలా ఎందుకు చేశాడు..ఇంత వింత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు


బ్రెజీల్ కు ( Brazil ) చెందిన డియాగో రబేలో, విటోర్ బ్యూనో అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. తరువాత మంచి ముహూర్తం చూసుకుని పిల్లా పెద్దలు అందరినీ పిలిచి  పెద్ద రిసార్టులో పెళ్లికి చేసుకుందాం అనుకున్నాడు.




గత సంవత్సరం నవంబర్ 1న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి మాత్రం 2019 సెప్టెంబర్ లో అని ఫిక్స్ అయ్యారు. కానీ జూలై నెలలో వారిద్దరి మధ్య చాలా పెద్ద వాగ్వివాదం జరిగింది. నీన్ను పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి ముఖం మీదే చెప్పేసిందట. దాంతో వారి మధ్య విషయాలు సెట్ కాదు అని అతను ఫిక్స్ అయ్యాడు.పెళ్లి రోజు అతిథులు అందరూ చేరుకున్నాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు. బదులుగా నన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఈ మాట విని ముందుగా షాక్ కు గురైన బంధుమిత్రులు తరువాత నీ ఇష్టం అబ్బాయి అని అంగీకరించారు.




Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్


అక్టోబర్ 17 డియాగో ఒక వీడియోను విడుదల చేశాడు. ఇందులో ఐడూ (I Do ) అంటే తనను తాను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను అని అద్ధంలో చూస్తూ తనను వివాహం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ( Social Media)  వైరల్ అయింది.


తన జీవితంలో ఇదే అత్యంత సంతోషకరమైన రోజు, నన్ను నాకన్నా ఎక్కువగే ఇష్టపడేవారు ఎవరుంటారు.. అందుకే నన్ను నేను పెళ్లి చేసుకున్నాను అని తెలిపాడు. నా పెళ్లి జీవితం విషాదంగా మారకుండా ఉండటానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇక నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోను. నా సంతోషం కోసం ఇతరులపై ఆధారపడను అని తెలిపాడు డియాగో.Also Read | Amazon Web Services: హైదరాబాద్‌లో అమేజాన్ 20 వేల పెట్టుబడులు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR