Three Girls Get Stuck In Elevator: యూపీలోని ఘజియాబాద్‌లోని అసోటెక్‌ ది నెస్ట్‌ సొసైటీలో ముగ్గురు బాలికలు లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. నవంబర్ 29 సాయంత్రం లిఫ్ట్‌లో ఇరుక్కుపోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సొసైటీ ఏఓఏ అధ్యక్షురాలు చిత్రా చతుర్వేది, సెక్రటరీ అభయ్‌ ఝాపై బుధవారం క్రాసింగ్‌ రిపబ్లిక్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొసైటీలోని డి టవర్‌లో నివాసం ఉంటున్న శివమ్ గెహ్లాట్ కుమార్తె తేజస్విని, ఇద్దరు స్నేహితురాళ్లు మిషిక, వైదేహితో కలిసి పార్కుకు వెళ్లేందుకు నవంబర్ 29న ఫ్లాట్ నుంచి వెళ్లిపోయింది. ముగ్గురూ 11వ అంతస్తు నుంచి లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. అయితే లిఫ్ట్‌లోకి వెళ్లిన తరువాత డోర్ మూసుకుపోయింది. దీంతో భయపడిపోయిన బాలికలు.. చాలా సేపు లిఫ్ట్ తెరవడానికి ప్రయత్నించారు. 


అందులో ఒక బాలిక మరో బాలికకు ధైర్యం చెబుతూ.. లిఫ్ల్ డోర్‌ను ఓపెన్ చేసేందుకు చాలా ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎమర్జెన్సీ కాల్ బటన్‌ను కూడా నొక్కినా.. ప్రయోజనం లేకుండా పోయింది. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు బాలికలు అందులో ఇరుక్కుపోయారు. ఆ చిన్నారుల వయస్సు దాదాపు 8 నుంచి 10 ఏళ్లు ఉంటుంది. 


 



దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు బాలికలు అందులో చిక్కుకున్నారు. వెంటనే వారు వచ్చి చిన్నారులను రక్షించారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలిక తండ్రి శివమ్ గెహ్లాట్ మాట్లాడుతూ.. అసోటెక్ నెస్ట్ క్రాసింగ్ రిపబ్లిక్‌లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోందన్నారు. ఈ ఏడాది లిఫ్ల్ నిర్వహణకు రూ.27 లక్షలు ఖర్చు చేసినా.. లిఫ్ట్ పనిచేయకపోవడంతో తన కూతురుతో పాటు ఇద్దరు చిన్నారులు దాదాపు 24 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారని చెప్పారు. ముగ్గురు పిల్లలూ భయపడిపోయారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. లిఫ్ట్ నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. 


Also Read: YS Sharmila: మంత్రి మరదలు అంటేనే చెప్పుతో కొడతా అన్నా.. ఆయన మగతనంతో నాకేం పని: వైఎస్ షర్మిల  


Also Read: Gujarat Assembly Elections: గ్యాస్ సిలిండర్, ఆయిల్ డబ్బాతో నిరసన.. సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చిన ఆప్ అభ్యర్థి   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook