Gujarat Election Voting 2022 Live Updates: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 39 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 788 మంది అభ్యర్థులను బరిలో ఉన్నారు. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న మిగిలిన 93 స్థానాలకు జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న రానున్నాయి.
తొలి దశ పోలింగ్‌లో ఆప్ పార్టీ అభ్యర్థి చేసిన ఓ ఘటన వైరల్ అవుతోంది. రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్‌కోట్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి దినేష్ జోషి విభిన్న రీతిలో ఓటు వేయడానికి వచ్చారు. గ్యాస్ సిలిండర్ (LPG సిలిండర్), నూనె డబ్బాతో సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఇలా డిఫరెంట్‌గా రావడం స్థానిక ప్రజలను ఆకర్షించింది.
ఓటు వేయడానికి ప్రజల ఉత్సాహం
రాజ్‌కోట్ వెస్ట్ సీటులోని దాదాపు ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి ప్రజలు ఉదయం నుంచి క్యూలో నిల్చున్నారు. యువతలో ప్రత్యేకించి తొలిసారి ఓటు వేసిన వారిలో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. ఓటు వేసేందుకు వచ్చిన జోషి.. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ మహత్తర పండుగలో ఒక్క ఓటుకు పెద్ద దెబ్బ తగులుతుందని ఓటర్లనుద్దేశించి అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు.
త్రిముఖ పోటీ..
ఈసారి ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బరిలోకి దిగింది. గత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈసారి ఎన్నికల బరిలో లేరు. ఆయన స్థానంలో బీజేపీ ఈసారి దర్శిత పరాస్ షాకు టికెట్ ఇచ్చింది. ఆయనకు పోటీగా కాంగ్రెస్‌కు చెందిన మన్‌సుఖ్ కలారియా, ఆప్‌కి చెందిన దినేష్ జోషి ఉన్నారు. గతసారి కాంగ్రెస్‌కు చెందిన ఇంద్రాణి రాజ్‌గురుపై విజయ్ రూపానీ 53 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.
రాజ్‌కోట్ రాజకీయ సమీకరణం
రాజ్‌కోట్ మొదటి నుంచి బీజేపీకి కంచుకోట. 1967 నుంచి 1975 వరకు ఇక్కడ భారతీయ జనసంఘ్ విజయం సాధించింది. 1980లో కాంగ్రెస్ ఇక్కడ నుంచి గెలిచింది. 1985 నుంచి రాజ్‌కోట్-2 సీటును బీజేపీ కైవసం చేసుకుంటోంది. 2012లో కొత్త డీలిమిటేషన్ తర్వాత దీని పేరు రాజ్‌కోట్ వెస్ట్‌గా మారింది.
Also Read: Korean Girl Video: లైవ్‌లోనే యువతిపై ఇద్దరు యువకులు.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook