Short video app TikTok as TickTock app: టిక్ టాక్ యాప్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా ? చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ భారత్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందా ? ఇండియాలో నిషేధానికి గురైన టిక్ టాక్ మొబైల్ యాప్ కంపెనీకి పేరెంట్ కంపెనీ అయిన బైట్ డ్యాన్స్ (ByteDance) కంపెనీ జులైలోనే టిక్ టాక్ యాప్ కోసం TickTock అనే కొత్త స్పెల్లింగ్ ఉపయోగించి ఇండియాలో ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా ప్రముఖ టిప్‌స్టర్, టెక్‌సావి అయిన ముకుల్ శర్మ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ప్రకారం TickTock app పేరుతో TikTok app భారత్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని.. కాకపోతే అందుకు కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. భారత్‌లో పూర్తి స్థాయిలో ఐటి రూల్స్ ఖరారైన తర్వాత టిక్ టాక్ యాప్‌ని ప్రవేశపెట్టాలి అని బైట్ డ్యాన్స్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. 


Also read : Instagram Kids Version: ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ ఇప్పట్లో లేనట్టే, కారణమేంటి


టిక్ టాక్ కంపెనీ కార్యకలాపాలు 2021 జనవరిలో పూర్తిగా నిలిచిపోయాయి. నెలకు 200 మిలియన్ యాక్టివ్ యూజర్స్‌ను సొంతం చేసుకున్న టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్ (TikTok short video app) భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ బ్యాన్ అయింది. టిక్ టాక్ కంపెనీపై ఇండోనేషియా నిషేధం ప్రకటించినట్టే ప్రకటించి నిషేధం ఎత్తేసింది.


అలాగే అమెరికాలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ ఫైలుపై సంతకాలు చేసినప్పటికీ.. జో బిడెన్ (Joe Biden) ఆ నిషేధాన్ని ఎత్తేశారు.


Also read: Google Services: గూగుల్ ఎక్కౌంట్ బ్లాక్ కాకూడదంటే ఫోన్ మార్చుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook