TikTok app: టిక్ టాక్‌ను రీప్లేస్ చేసే యాప్ రాబోతోందా ?
TikTok app: కరోనావైరస్ సంక్రమణ, భారత్‌తో వివాదం నేపధ్యంలో చైనాను, చైనా యాప్స్‌ను నిషేధించాలన్న ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ ( TikTok )పై పడింది. అయితే, టిక్‌టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇతర ఇంకొన్నిఇతర యాప్స్ రంగంలోకి దిగుతున్నాయి.
TikTok app: కరోనావైరస్ సంక్రమణ, భారత్‌తో వివాదం నేపధ్యంలో చైనాను, చైనా యాప్స్‌ను నిషేధించాలన్న ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ ( TikTok )పై పడింది. అయితే, టిక్‌టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇతర ఇంకొన్నిఇతర యాప్స్ రంగంలోకి దిగుతున్నాయి. అలా టిక్ టాక్ యాప్‌కి పోటీగా రంగంలోకి దిగుతున్న వాటిలో యూట్యూబ్‌కి చెందిన యాప్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌పై తనదైన ముద్ర కలిగిన గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ ( Youtube new feature ) ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకువస్తోంది. ఇది నూటికి నూరుపాళ్లు చైనా దేశపు టిక్ టాక్‌ను పోలి ఉంటుంది.
కరోనావైరస్ సంక్రమణ, భారత -చైనాల సరిహద్దు వివాదం నేపధ్యంలో ఆ దేశపు ఉత్పత్తుల్ని యాప్‌లను నిషేదించాలనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ నేపధ్యంలో యూ ట్యూబ్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులో తీసుకురానుంది. టిక్ టాక్ మాదిరిగానే ఈ ఫీచర్ ఉంటుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ సంస్థ వెల్లడించింది. అయితే ఇందులో కేవలం 15 సెకన్ల వరకే వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు.
ట్రయల్స్ అనంతరం భారీగా ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఒకేసారి ఎక్కువ వీడియోల్ని అప్‌లోడ్ చేయాలనుకుంటే మాత్రం ఫోన్ గ్యాలరీ నుంచి నేరుగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే టిక్ టాక్ యాప్‌లో వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటం, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులకు ఉండటం అడ్వాంటేజ్‌గా ఉంది. ఇప్పుడు యూట్యూబ్ లాంచ్ చేయనున్న కొత్త ఫీచర్‌లో ఇవన్నీ ఉంటాయా లేదా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
షార్ట్స్ ( Shorts ) పేరుతో మార్కెట్‌లో రానున్న ఈ కొత్త ఫీచర్ టిక్‌టాక్‌ను తలదన్నుతుందా లేదా అనేది వేచి చూడాలి. గతంలో కూడా యూట్యూబ్ కొన్ని ప్రయోగాలు చేసి విఫలమైంది. ఇటు ఫేస్‌బుక్ ( Facebook ) కూడా టిక్ టాక్ మాదిరిగానే లాస్సో ( Lasso ) అనే యాప్‌ను తీసుకురానుందని తెలుస్తోంది.