Sonali Phogat Dance Video: టిక్‌టాక్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్, బీజీపీ నేత సోనాలీ ఫోగట్ అర్ధంతరంగా కన్నుమూసింది. యువత హృదయాల్ని కొల్లగొట్టిన సోనాలీ..సల్మాన్ ఖాన్‌ల డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ నేత, ప్రముఖ టిక్‌టాక్ స్టార్, బిగ్‌బాస్ సీజన్ 14 కంటెస్టెంట్ సోనాలీ ఫోగట్ అంటే తెలియనివారుండరు. అందం, అభినయంతో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన సోనాలీ ఫోగట్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించింది. సోనాలీ ఫోగట్ హఠాన్మరణం అభిమానులకు షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. బిగ్‌బాస్ సీజన్ 14లో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 


ఇప్పుడు సోషల్ మీడియాలో సోనానీ ఫోగట్ , సల్మాన్ ఖాన్‌ల డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ సీజన్ 14 వేదికపై హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో కలిసి రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇది. టిప్‌టిప్ బర్సా పానీ పాటకు సోనాలీ ఫోగట్ డ్యాన్స్ చేస్తోంది. కాస్సేపటికి ఆమెతో సల్మాన్ ఖాన్ జాయిన్ అవుతాడు. డ్యాన్స్ మాస్టర్ ధర్మేష్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు.



సోనాలీ ఫోగట్ పాత వీడియో ఇప్పుడు గట్టిగా వైరల్ అవుతోంది. ఆమె జ్ఞాపకాల్ని ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆవేదనకు లోనవుతున్నారు. ఆమె మరణంపై నివాళి అర్పిస్తున్నారు. సోనాలీ ఫోగట్ యాంకరింగ్, మోడలింగ్‌తో పాటు రాజకీయాల్లో కూడా ఉంది. పంజాబి, హర్యానా సినిమాలు, మ్యూజిక్ వీడియోలు చేసింది. 


Also read: Krait Snakes Video: ఇంట్లో రెండు ప్రమాదకరమైన క్రైట్ స్నేక్‌లు.. రెండింటిని ఒకేసారి పట్టాడు! నీకో దండంరా అయ్యా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook