Snake catcher caught Two Krait Snakes very easily at Home: అతిపెద్ద పాముల్లో 'క్రైట్ స్నేక్' కూడా ఒకటి. క్రైట్ స్నేక్ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. అలాంటిది నేరుగా కనిపిస్తే అంతే సంగతులు.. ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కిలోమీటరు దూరం పరుగు తీస్తారు.క్రైట్ స్నేక్ అత్యంత విషపూరితమైంది కూడా. ఈ పాము కాటుకు ఇప్పటికే చాలా మంది చనిపోయారు కూడా. అందుకే స్నేక్ క్యాచర్‌లు కూడా ఈ పామును పట్టుకోవడానికి కాస్త జంకుతుంటారు. అయితే స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా చాలా సులువుగా రెండు పాములను పట్టుకున్నాడు.
ఒడిశాలోని ఓ పాత ఇంటిలో ప్రమాదకరమైన రెండు క్రైట్ స్నేక్‌లు దూరాయి. ఓ రూమ్‌లోకి దూరడంతో ఇంట్లోని వారు తలపెట్టి.. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లాకు కబురు చేశారు. విషయం తెలుసుకున్న మురళీవాలే.. ఆ ఇంటికి వెళ్ళాడు. డోర్ తీసి చూడగా.. రెండు క్రైట్ స్నేక్‌లు ఉన్నాయి. ఓ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అది పరుగులు పెట్టింది. నెమ్మదిగా రెండింటిని ఒక దగ్గరికి తెచ్చి పట్టుకోవడానికి ప్రయతించగా సాధ్యం కాలేదు.
మరోసారి రెండు క్రైట్ స్నేక్‌లను ఒక దగ్గరికి తెచ్చిన స్నేక్ క్యాచర్ మురళీవాలే.. స్టిక్ సాయంతో ఓ క్రైట్ స్నేక్ తోకను పట్టుకుంటాడు. ఆపై ఇంకో క్రైట్ స్నేక్‌కు కూడా అలానే పట్టుకుంటాడు. బయటకు తీసుకొచ్చిన అనంతరం వాటిని ఓ సంచిలో వేసి పట్టుకుంటాడు. ఆపై ఆ రెండు క్రైట్ స్నేక్‌లను అడవిలో వదిలేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియోను మురళీవాలే హౌస్లా తన యూట్యూబ్ ఛానెన్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సంవత్సరం క్రితం అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోకు 2,867,701 వ్యూస్ వచ్చాయి.
Also Read: 25 ఏళ్ల కింగ్ కోబ్రా.. ఎన్ని గుడ్లు పెట్టిందో తెలుసా? బుసలు కొడుతున్నా ఎగ్స్ బయటికి తీసుకొచ్చాడు
Also Read: Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook