Snake Video: కింగ్ కోబ్రాను అమాంతం మింగేసిన మరో భారీ స్నేక్.. ఆ స్నేక్ చూపుకే భయం పుట్టడం ఖాయం..
King Cobra Swallowed by Another Snake: కింగ్ కోబ్రాను మరో స్నేక్ అమాంతం మింగేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
King Cobra Swallowed by Another Snake: ఆకలితో ఉన్న సింహం భారీ సైజు దున్నలను అమాంతం వేటాడే వీడియోలు మనం చూసే ఉంటాం. ఇప్పుడు మనం చూడబోతున్న వీడియో ఆకలితో ఉన్న ఓ పాముది. ఆకలితో నకనకలాడిందో ఏమో తెలియదు కానీ ఆ భారీ పాము కింగ్ కోబ్రాను అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేక్ వరల్డ్ అనే హ్యాండిల్‌లో ఈ వీడియోని పోస్టు చేశారు. వీడియోని గమనిస్తే.. నలుపు రంగులో ఉన్న ఓ భారీ సైజు పాము జర జరా పాకుతూ వచ్చి ఒక బొరియలోకి చొరబడుతుంది. ఆ బొరియలో దాక్కున్న కింగ్ కోబ్రాను బయటకు లాగి.. కొంచెం కొంచెంగా దాన్ని పూర్తిగా మింగేస్తుంది. చివరలో ఆ పాము చూసే చూపు భయం పుట్టించేలా ఉంటుంది.
ఈ స్నేక్ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక కింగ్ కోబ్రా మరో కింగ్ కోబ్రాను తినేసిందంటూ నెటిజన్లు వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల్లో నరమాంస భక్షణ లాగా స్నేక్స్‌లో ఇలా కూడా ఉంటుందన్నమాట అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ లుక్కేయండి.
Also Read: Dangerous Snake Rescue Video: ఎంత గట్స్ ఉంటే ఈ సాహసం చేయాలి.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook