Crocodile Attacks On Zebra: సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అడవిలో క్రూర మృగాలు వేటాడకపోతే అవి తమ మనుగడను సాగించలేవు. సింహం నుంచి మెుసలి వరకు వేట ద్వారానే ఆకలిని తీర్చుకుంటాయి. వీటికి దొరక్కుండా కొన్ని సాధు జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ మాంసహార జంతువులకు చిక్కి ఆహారంగా మారతాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో గురించి ఇప్పడు చెప్పుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీటిలో ఉన్న మెుసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని అంటారు. నీళ్లలోకి ఏ జంతువైనా వస్తే.. దాని పనిఅయినట్లే లెక్క. ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టుబెడుతుంది మెుసలి. తాజాగా నీళ్లు తాగడానికి వచ్చిన ఓ జీబ్రా మెుసలి నోటికి (Crocodile Attacks On Zebra) చిక్కింది. దాని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది జీబ్రా. కానీ మెుసలి పట్టు నుండి అది తప్పించుకోలేకపోయింది. మెుసలి బలంగా తన కోరలతో నీటి మధ్యలో లాగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. wildlifeanimall అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.



 


Also Read: Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook