Girl Start Grooming Hair with Hair Straightener in Delhi Metro: కొందరి క్రియేటివిటీ ఊహజనితం. వాళ్లు చేసే పనులు చూస్తే.. ఎక్కడ నుంచి వస్తాయండీ ఈ బాబు ఇలాంటి ఐడియాలు అని తప్పకుండా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక పంథాలో వెళుతున్నారు. ఇక ఇటీవల ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో యువత చేస్తున్న చేష్టలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువతి మెట్రో ట్రైన్‌లోనే ఏకంగా హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించింది. మెట్రోలో ఛార్జింగ్ కోసం ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లను ఇలా కూడా వాడొచ్చని ఆ యువతి నిరూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్‌లు వేయడం.. బికినీలతో అమ్మాయిలు కనిపించడం.. ముద్దులు పెట్టుకోవడం ఇప్పటివరకు చూశారు. కానీ ఈ అమ్మాయి క్రియేటివిటీ నెక్ట్స్‌ లెవల్ అని చెప్పొచ్చు. మెట్రో రైలు‌లో ఓ యువతి హెయిర్‌ స్ట్రెయిట్‌నర్‌తో తన జుట్టును స్ట్రెయిట్ చేసుకుంది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే మెట్రోలో తన జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అమ్మాయి హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ను ఉపయోగించడం వైరల్‌గా మారింది.  


Also Read: Team India Head Coach: ద్రావిడ్ తరువాత ఎవరు..? టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆ నలుగురు..!


వీడియోలో యువతి ముఖం స్పష్టంగా కనిపించలేదు. "ఢిల్లీ మెట్రో కీ బాత్ హీ కుచ్ అలగ్ హై" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచే సమాజంలో ఎలా మెలగాలో నేర్పిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఇంట్లో సమయం లేనంత బిజీగా ఉన్నారా మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 




మరికొందరు ఆ అమ్మాయి పట్ల సానుభూతి చూపిస్తున్నారు. ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం మనకు తెలియదని.. బిజీగా ఉండవచ్చని అంటున్నారు. ఇంట్లో రెడీ అయ్యే సమయంలో కరెంట్ లేదేమో అని.. అందుకే తన క్రియేటివిటీతో ఇలా మెట్రోలో హెయిర్ స్ట్రైట్ చేసుకుందోని ఇదో గొప్ప ఆలోచన అని అభినందిస్తున్నారు.  


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి