Viral Video: థ్రిల్ కోసం వెళితే బొక్క బోర్లా పడ్డారు.. బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు.. వీడియో వైరల్
Adventure Life Video: థ్రిల్ కోసం వెళ్లి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఏదో చేద్దామని అనుకుంటే ఇంకేదో అయింది. చివరికి బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Adventure Life Video: ప్రస్తుతం చాలామంది లైఫ్ థ్రిల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. రోటిన్‌గా గడిపిస్తే ఏ లాభం అనుకుని.. కాస్తా సాహస యాత్రల బాట పడుతున్నారు. కాస్త రిస్క్ అయినా పర్లేదులే అంటూ రెడీ అయిపోతున్నారు. అడవికి వెళ్లడం, విన్యాసాలు చేయడం, క్లిష్ట పరిస్థితులను దాటడం.. ఇలా ఎన్నో రకాల సాహాసాలు చేస్తున్నారు. ప్రతి వారాంతంలో ఇలాగే చేసి సాహస జీవితాన్ని ఆస్వాదించాల్సిన వారు విదేశాల్లో చాలా మంది ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. తాజాగా స్పెషల్ థ్రిల్‌ను ఆస్వాదించేందుకు ట్రక్ ఎక్కిన ప్రజలు.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వైరల్ అవుతున్న వీడియోలో ట్రక్‌పై నిలబడి చాలా మంది నిలబడి బురదలోకి వెళుతున్నారు. వెళ్లే ముందు అందరికీ టాటా చెబుతూ.. సంతోషంగా వెళ్లారు. కొన్ని సెకన్లలో ట్రక్ ముందుకు సాగి చిత్తడి నేలలోకి ప్రవేశిస్తుంది. మొదట్లో బురదలోకి దిగే సమయంలో ప్రజల్లో ఉత్సాహం కనిపించినా.. కొన్ని సెకన్ల తర్వాత ఈ సాహసం ప్రమాదంగా మారింది. ట్రక్ బురద నీటిలోకి ప్రవేశించిన వెంటనే.. టైర్లు అటు ఇటు కదులుతూ లోపలికి వెళ్లిపోయాయి. ట్రక్కు పైన నిలబడి ఉన్న డజన్ల కొద్దీ ప్రజలు చిత్తడిలో పడిపోయారు.
మరికొందరు బురద నీటిలోకి పడిపోకుండా ట్రక్‌ను గట్టిగా పట్టుకుని ఉండిపోయారు. అయితే డ్రైవర్ కూడా తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. బురదలో పడిన వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ట్రక్ అక్కడే బురదలో చిక్కుకుపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనేక మంది ఈ వీడియోపై లైక్‌ల వర్షం కురిపిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు. ట్రక్ బోల్తా పడి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 6 మిలియన్ వ్యూస్ సంపాదించింది. మీరూ ఓ లుక్కేయండి.
Also Read: India Vs Sri Lanka: నేడే శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్.. ఈ ప్లేయర్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్..!
Also Read: Pawan Kalyan: చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook