Bull Fighting Video Goes Viral: కొన్నిసార్లు రోడ్డుపైన ఉండే జంతువులు క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. మనదారిన మనం వెళ్తున్నదాడులకు దిగుతుంటాయి. కొందరు రోడ్ల పైన ఆవులను, ఎద్దులను వదిలేస్తుంటారు. అవి రోడ్డుపైన దొరికే ఆహార పదార్థాలను తింటు ఉంటాయి. అక్కడక్కడ దుకాణాదారాలు, కూరగాయల షాపుల వారు వాటికి ఏవైన తినడానికి ఇస్తుంటారు. దీంతో అవి కోపంగా ఉంటాయి. మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఎద్దులు కుమ్ముకుంటాయి. మనదారిన మనం పోతున్న కూడా కొన్నిసార్లు పొడుస్తుంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో జంతువులకు సరైన తిండి, నీళ్లు దొరక్క ఆవులు,ఎద్దులు లేదా కుక్కలు కూడా వింతగా ప్రవర్తిస్తుంటాయి. దాని పక్కన నుంచి వెళ్లిన కూడా.. అది దాడులకు పాల్పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతేకాకుండా, కుక్కలు కరవడం మనం చూస్తుంటాం. జంతువులు కొన్నిసార్లు, తమలో తామే దాడులకు పాల్పడుతుంటాయి. ఎద్దులు కూడా ఒకదానిపైమరోకటి పొచుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ ఈసారి రెండు ఎద్దులు షాపులో దూరి మరీ దాడులు చేసుకున్నాయి. అక్కడున్న వారంతా భయంతో పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు ఎద్దులు ఒక మార్కెట్ లో ఒకదానికి మరోకటి ఎదురుపడ్డాయి. మరీ వాటికి ఏమనిపిచ్చిందో కానీ.. ఒక్కసారిగా కుమ్ముకోవడం మొదలెట్టాయి. అంతేకాకుండా.. అక్కడే ఉన్న బట్టల షాపులోకికూడా దూరిపోయాయి. ఒకదాన్ని మరోకటి బలంగా నెట్టుకుంటూ షాపులోకి వెళ్లిపోయాయి. షాపులో ఉన్న కస్టమర్లు కూడా భయంతో దూరంగా వెళ్లిపోయారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎద్దులను అదిలించే ప్రయత్నం చేశారు.


Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..


కానీ అవి ఏమాత్రం తగ్గకుండా.. అక్కడున్న వస్తువులను చిందర వందరగా చేస్తుంటాయి. అంతే కాకుండా.. అక్కడి ర్యాక్ లో ఉన్న చీరలు, బట్టల బాక్సులు కిందపడిపోయాయి. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం కుమ్ముకోవడం బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వామ్మో.. ఎద్దులేందీమరీ ఇలా పొట్లాడుకుంటున్నాయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter