Viral Video Of King Cobra Snakes Dancing: సోషల్ మీడియాలో మీరు ఎన్నో డ్యాన్స్ రీల్స్, ఫన్నీ వీడియోలు, ఆకట్టుకునే పెంపుడు జంతువుల వీడియోలు చూసే ఉంటారు. కానీ అవంతా ఒక ఎత్తయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మరో ఎత్తు. మీరు గతంలో ఎన్నో పాముల వీడియోలు చూసే ఉంటారు కానీ రెండు పాములు ఇలా పోటాపోటీగా సయ్యాటలు ఆడటం చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసినా అవి అడవిలోనో లేక పంట పొలాల్లోనూ అలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ మీ ఇంట్లో పార్కింగ్ ఏరియాలోకి పాము వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా ఒకటి కాదు.. రెండు నాగుపాములు వచ్చి ఒకదానినొకటి అల్లుకుని డాన్స్ చేయడం చూస్తే కచ్చితంగా మీ గుండె గుబేల్‌మనడం ఖాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంజన్ కపూర్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు మిలియన్ మంది వీక్షించారు.



 


ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌లో చాలామంది భయపడినట్టుగా కామెంట్స్ రూపంలో తమ రియాక్షన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం మరొకటి ఉందండోయ్. చాలా సందర్భాల్లో రెండు పాములు ఇలా డాన్స్ చేస్తున్నట్టుగా ఉండటం చూసి అవి డాన్స్ చేస్తున్నాయనే భావిస్తారు. లేదంటే ఇంకొన్నిసార్లు అవి సంభోగంలో పాల్గొంటున్నాయని అనుకుంటారు. అయితే, శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే.. ఒకే జాతికి చెందిన రెండు పాములు.. ఇంకా చెప్పాలంటే రెండు ఆడపాములు కానీ లేదా రెండు మగ పాములు ఇలా ఒకదానినొకటి అల్లుకుని పోటీపడుతున్నాయంటే అది డాన్స్ అని అర్థం కాదట.. అవి కుస్తీ పోటీలో ఉన్నాయని అర్థమట. అవి ఒకదానితో మరొకటి ఫైటింగ్ చేస్తున్నాయని కూడా అనుకోవచ్చని స్నేక్స్ సైన్స్ తెలిసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


ఇది కూడా చదవండి : Viral Video: బస్సు డ్రైవర్‌తో పెట్టుకున్న సైకిలిస్ట్.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి


ఇది కూడా చదవండి : Elevator Viral Video: స్ట్రెచర్‌పై పేషెంట్ సగంలో ఉండగానే జారిన లిఫ్ట్


ఇది కూడా చదవండి : Leopard Attacks on Vehicle: వాహనంలో వెళ్తున్న వారిపైకి దూకిన చిరుతపులి.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook