Two snakes dance in agriculture land in ranga reddy: పాములు చాలా అరుదుగా కన్పిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు మన ఇళ్లలోకి ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ఎలుకల వేటలో భాగంగా వస్తుంటాయి. కొన్నిసార్లు పాములు కాటు వేసిన సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కానీ మరికొందరు మాత్రం పాములు చూడగానే అలర్ట్ అయిపోతుంటారు. వెంటనే స్నేక్ హెల్పింగ్ వారికి సమాచారం ఇస్తారు. చాలావరకు కూడా పాములకు హని కల్గించకూడదని చాలా మంది భావిస్తుంటారు. కొందరు పాములకు హనీ కల్గిస్తే నాగదోషం చుట్టుకుందని చెప్తుంటారు. ఈ దోషం వల్ల పెళ్లి, జీవితంలో సెటిల్ మెంట్ అనేది ఆలస్యంగా మారుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొందరు పాముల పట్ల సైకోలుగా ప్రవర్తిస్తుంటారు. పాములు కాటు వేస్తే, వాటిని తిరిగి కొరకడం, చంపేయడం కూడా చేస్తుంటారు. పాములకు సంబంధించిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో కొన్ని వెరైటీగాను, మరికొన్ని భయాన్ని కల్గించేలా కూడా ఉంటాయి. రెండు పాములు ఎదురైనప్పుడు చాలా వరకు అవి పోట్లాడుకుంటాయని చెప్తుంటారు. కానీ కొన్ని సార్లు పాములు మాత్రం కొట్టుకొకుండా.. సయ్యాట లాడుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు..



రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో అదురైన ఘటన చోటు చేసుకుంది.  మేడిపల్లి గ్రామం సమీపంలో గత రెండు రోజుల క్రితం భారీగా వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంత మంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. పొలాలన్ని పచ్చదనంతో కన్పిస్తున్నాయి. చుట్టు ఉన్న ప్రదేశమంతా..ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఈ క్రమంలో.. అక్కడ  జంట పాములు సయ్యాటడుకోవడం స్టార్ట్ చేశాయి. అక్కడ పొలంపనులకు వెళ్లిన,  రాజిరెడ్డి ఈ ఘటనను చూశాడు.


Read more: Bhole baba Properties: వామ్మో.. భోలే బాబాకు అన్ని కోట్ల ఆస్తులు, కళ్లు చెదిరే బంగ్లాలున్నాయా..?


వెంటనే చప్పుడు చేయకుండా.. తన ఫోన్ లో పాముల డ్యాన్స్ లను రికార్డు చేశాడు.  వ్యవసాయ పొలంలో దాదాపు 30 నిమిషాల పాటు సయ్యాటలాడినట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. పాములు భలే డ్యాన్స్ లు చేస్తున్నాయని కొందరు, మరికొందరు జాగ్రత్త బ్రో.. పాములను డిస్టర్బ్ చేయోద్దంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి