Cylinder Theft: దొంగలు రూట్‌ మారుస్తున్నారు. ఇన్నాళ్లు బంగారం, నగదును దొంగలించేవారు. ఇప్పుడు తమకు అవసరమైన వస్తువులను దొంగిలిస్తున్నారు. తాజాగా ఇద్దరు యువకులు గ్యాస్‌ సిలిండర్‌ దొంగతనానికి పాల్పడ్డారు. అది కూడా కారులో దర్జాగా వచ్చి పట్టపగలు నిలిపి ఉన్న ఆటోలో దొంగతనం చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మీరేం దొంగలు రా నాయనా అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyber Fraud: అమ్మాయి పేరుతో అబ్బాయి వేషాలు.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ లీలలు మామూలుగా లేవు


హైదరాబాద్‌ మాదన్నపేటలోని భార్గవి గ్యాస్‌ ఏజెన్సీకి సంబంధించిన ట్రాలీ ఆటోలో గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తుంటారు. రీఫిల్‌ సిలిండర్లకు వినియోగదారులకు అందించేందుకు వెళ్లిన క్రమంలో ఈ దొంగతనం జరిగింది. రోడ్డు పక్కన ఆటో నిలిపి సిలిండర్‌ ఇచ్చేందుకు సైదాబాద్‌ ప్రధాన రోడ్డు పక్కన ఆపి వినియోగదారుడి ఇంటికి సిబ్బంది వెళ్లారు. గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి వచ్చాక యథావిధిగా మిగతావి పంపిణీ చేశారు. అయితే ఆఖరకు సిలిండర్లలో సంఖ్య తేడా వచ్చింది. ఆకటి కనిపించడం లేదని గమనించారు. సిలిండర్‌ దొంగతనం జరిగిందని గమనించి వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సీసీ కెమెరాల్లో యువకులు సిలిండర్‌ ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసి అవాక్కయ్యారు.

Also Read: Momos: భార్యాభర్తల మధ్య 'మోమోస్‌' చిచ్చు.. విడాకులివ్వాలని కేసు పెట్టిన భార్య



దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. అక్కడ ఆపి ఉన్న ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ వద్ద ఆగారు. కారులో నుంచి ఓ వ్యక్తి దిగి ఆటో చుట్టూ తిరిగాడు. చుట్టూ పరిస్థితులు గమనించి భవనం వద్దకు వెళ్లాడు. ఫోన్‌ మాట్లాడుతూ కారులో ఉన్న యువకుడికి సైగలు చేశాడు. అతడి సైగలకు కారులో నుంచి డ్రైవర్‌ దిగాడు. అటు ఇటు చూసి ఆ యువకుడు వెంటనే ఆటోలో గ్యాస్‌ సిలిండర్‌  తీసుకుని నెమ్మదిగా కారులో పెట్టేశాడు. అనంతరం ఫోన్‌లో 'వచ్చేయ్‌' అని చెప్పడంతో బయట ఉన్న వ్యక్తి కూడా కారు లోపలికి ఎక్కేశాడు. నిమిషంన్నర వ్యవధిలో ఈ దొంగతనం జరిగింది.

గ్యాస్‌ సిలిండర్‌ దొంగతనమే చాలా వింత. మరి అందులో పెద్ద కారు వేసుకుని వచ్చి గ్యాస్‌ సిలిండర్‌ దొంగతనం చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన. ఇది పక్కా ప్రణాళికగా చేశారా? అకస్మాత్తుగా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ దొంగతనంపై ఏజెన్సీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించి కారు నంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే అవకాశం ఉంది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను చూసిన వారంతా నవ్వుకుంటున్నారు. 'మీరేంట్రా ఇలా తయారయ్యారు?' అని కామెంట్ చేస్తున్నారు. 'పోయి పోయి గ్యాస్‌ సిలిండర్‌ ఎత్తుకెళ్లడం వింతగా ఉంది', 'గ్యాస్‌ ధరలు భరించలేక ఇలా దొంగతనం చేస్తున్నారా?' అని మరికొంతమంది చెబుతున్నారు. 'బ్యాచిలర్‌ కష్టాలు ఇలాగే ఉంటాయి' అని బ్యాచిలర్స్‌ కామెంట్లు చేస్తున్నారు. 'రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తుంటే ఇంకా దొంగతనం చేయడం ఏమిటి రా' అని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే సిలిండర్‌ దొంగలను పోలీసులుపట్టుకోనున్నారు. కాగా, ఆ దొంగలు ఎవరా అని నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు గ్యాస్‌ సిలిండర్‌ దొంగతనం చేయడం గల కారణాలు ఆరా తీస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook