ఆధార్ కార్డులో ఇక నుంచి ఆ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ
Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలక మార్పులు చేసింది. ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకుంటే ఇది తప్పక వినాల్సిందే. అది లేకుంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ మార్చలేరు.
Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలక మార్పులు చేసింది. ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకుంటే ఇది తప్పక వినాల్సిందే. అది లేకుంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ మార్చలేరు.
ఆధార్ కార్డు(Aadhaar Card)లోని చిరునామాను అప్‌డేట్ చేయాలంటే ఇక నుంచి ఆధారం తప్పనిసరి. ఈ మేరకు యూఐడీఏఐ కీలక సూచనలు చేసింది. ఇక నుంచి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలనుకుంటే ఏ విధమైన రుజువులు, ఆధారాలు లేకుండా మార్చలేం. అడ్రస్ వాలిడేషన్ లెటర్ సౌకర్యం ప్రస్తుతానికి యూఐడీఏఐ నిలిపివేసింది. ఆధార్ దరఖాస్తులో ఇచ్చిన చెల్లుబాటయ్యే డాక్యుమెంట్ ఆధారంగా మాత్రమే అడ్రస్ మార్చుకునే అవకాశముంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు చిరునామా ఎలా మార్చాలంటే..
ముందుగా ఆధార్ పోర్టల్ ssup.uidai.gov.in/ssup ఓపెన్ చేసి..Proceed to Update Aadhaar క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 12 అంకెల యూఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా క్లిక్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకుని..రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి క్లిక్ చేయాలి. మీ ఆధార్ వివరాల్ని చూపిస్తుంది. చిరునామా మార్చి..రుజువుగా యూఐడీఏఐ ఆమోదించిన 32 డాక్యుమెంట్లతో ఏదో ఒకదానికి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఆధార్ అడ్రస్ అప్‌డేట్ (Aadhaar Update)ప్రోసెస్‌లో ఉందనే మెస్సేజ్ వస్తుంది. పదిరోజుల వ్యవధిలో అడ్రస్ మారి..కొత్త ఆధార్ కార్డు ఇంటికి చేరుతుంది.
Also read: ఏపీలో త్వరలో ప్రారంభం కానున్న న్యుమోనియా వ్యాక్సినేషన్ కార్యక్రమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook