Viral Video: వెక్కి వెక్కి ఏడుస్తూ ఉక్రెయిన్ వీడిన బాలుడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వైరల్ వీడియో!
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటున్నారు.
Viral Video: రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కు బిక్కుమంటున్నారు.
బతికింటే ఏ పని చేసుకునైనా జీవనం సాగించొచ్చనే ఉద్దేశంతో.. ఎంతో మంది ఇల్లు, వాకిలి.. ఆస్తి, పాస్తులు వదిలేసి వెళ్లిపోతున్నారు.
తాత్కాలికంగా చదువుకోసమో.. ఇంకేదైన పనిమీదనో కొంతకాలానికి ఉంటున్న ఇంటిని వదిలివెళ్లిపోతేనే చాలా మంది ఎంతో బాధపడుతుంటారు. అలాంటిది.. తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితుల్లో ఉక్రెయిన్ వాసులు తమ ఇంటిని, ఊరిని విడిచి వెళ్లిపోతున్నారు.
ఇందుకు సంబంధించి ఎన్నో వీడియోలు బయటకు రాగా.. అవి చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నారు. తాజాగా ఓ బాలుడు ఉక్రెయిన్ వీడుతు.. పోలాండ్ బార్డర్‌కు చేరుకున్నాడు.
బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో బారంగా అడుగులు వేస్తున్నాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఆ పసివాడి వెంట తెలిసినవాళ్లు ఎవరూ లేనట్లు తెలుస్తోంది. కానీ కుర్రాడితో పాటు ఉక్రెయిన్ దాటుతున్న వారిలో ఒకరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
Also read: Viral Video: ప్రపంచాన్ని కదిలిస్తున్న ఉక్రెయిన్ చిన్నారి పాట, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook