Guest Fighting For Lunch Plates: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ కంటెంట్ కాస్తంతా ఎక్కువగానే ఉంటుంది. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఫన్నీగా ఉండి కడుపబ్బ నవ్వోస్తుంది. మరికొన్నింటి చూస్తే మాత్రం షాకింగ్ కు గురిచేసి, ఇవేం వీడియో బాబోయ్ అంటూ కూడా కామెంట్లు పెడుతుంటారు. కొన్ని పెళ్లి వేడుకలో కొత్త జంట వెరైటీగా ఎంట్రీ ఇవ్వడం, మరికొన్నింటిలో .. వరుడు, వధువు కొట్టుకొవడం, కొత్త జంటలు ఫన్నీగా డ్యాన్స్ లు చేయడం వంటి వీడియోలు వార్తలలో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


వరుడి బట్టతల బైటపడటం వంటి ఫన్నీ ఘటనలు జరిగాయి. ఇంకా.. పెళ్లి జరుగుతుండగా.. మాజీ లవర్ ఎంట్రీ ఇవ్వడం వంటివి కూడా జరిగాయి. పెళ్లిలో చికెన్ బాగాలేదని, వంట బాగా వండలేదని గొడవలు పడ్డారు. అంతే కాకుండా.. పెళ్లికి ఆలస్యమైందని కూడా వాగ్వాదాలు జరుగుతుంటాయి. అచ్చం ఇలాంటి ఒక ఫన్నీ రిజన్ తో ఈ పెళ్లి కాస్త వైరల్ గా మారింది..


ఈ ఫన్నీ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఒక పెళ్లి వేడుక గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇంతలో.. పెళ్లికి అతిథులు, స్నేహితులు అందరు చేరుకుంటున్నారు. వేడుక అరెంజ్ మెంట్స్ ధూందాం గా జరుగుతున్నాయి. క్యాటరీంగ్ దగ్గర కూడా అనేక ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం ప్రత్యేకంగా వెజ్, నాన్ వెజ్ వంటకాలు చేయించారు. ఈ క్రమంలో ఒక అనుకొని ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా భోజనాల కోసం ఎగబడ్డారు. అప్పుడు కాస్తంతా తోపులాగ జరిగింది. క్యాటరింగ్ దగ్గర అతిథులకు సరిపడా ప్లేటులేక పోవడంతో కాస్తంత వాగ్వాదం జరిగింది.


Read More: Rithu Chowdary hot Show: రెడ్ గౌనులో రీతూ అందాల బాంబ్.. చూస్తే తట్టుకోలేరు..


అతి చినికి, చినికి గాలివానగా మారింది. దీంతో అక్కడున్న వారంతా కొట్టుకొవడం స్టార్ట్ చేశారు. చూస్తుండగానే ఒకరిపై మరోకరు కూర్చీలు విసిరేసుకున్నారు. మరికొందరు పిడిగుద్దులు విసిరుకున్నారు. అక్కడున్న కొంతమంది గొడవ పడుతున్న వారిని సముదాయించే ప్రయత్నం చేసిన ఎవరు కూడా పట్టించుకోవట్లేదు.


కుర్చీలనన్ని కూడా విరిగిపోయాయి. పెళ్లి వేడుక అంతా కళావిహీనంగా మారిపోయింది. అరుపులు ,కేకలు, పిడిగుద్దులు కొట్టుకుంటూ నానా రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజర్లు వామ్మో... ఇదేంది బాబోయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook