Bride Wedding Called Off On Fiance Behaviour: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు వైరల్ గా మారతుంటాయి. వీటిలో కొన్ని ఘటనలు ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్వుతెప్పిస్తుంటాయి. మరికొన్ని షాకింగ్ నకు గురిచేసేలా ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యమేస్తుంటుంది. ముఖ్యంగా నెటిజన్లు ఫన్నీ వీడియోలు, ట్విస్టింగ్ కు సంబంధించిన ఘటనలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. పెళ్లి వేడుకలకు సంబంధించిన కంటెంట్ కు సోషల్ మీడియాలో ఏమాత్రం కొదువలేదని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Unhealthy Food Habits: ఆఫీసులో అదేపనిగా చిరుతిండ్లు తింటున్నారా..?.. మీరు ఈ డెంజర్ లో పడ్డట్లే..


కొందరు పెళ్లిళ్లలో మరీ.. కావాలనిచేస్తారో , పబ్లిసిటీ రావాలని చేస్తారో.. మరేంటో కానీ పెళ్లి వేడుకలు కాస్త వైరల్ గా మారుతుంటాయి. కొన్నిసార్లు స్టేజీ మీదనే మాజీ ప్రియుడి ఎంట్రీ ఇస్తుంటారు. బట్టతల దాచిపెట్టి పెళ్లిళ్లు చేస్తుంటారు. వరుడు తాగి పెళ్లిలో తూలిపడుతుంటాడు. వధువు, వరుడు మధ్య సరదాగా సంఘటనలు గొడవల వరకు వెళ్తుంటాయి.అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు..


ఉత్తర ప్రదేశ్ లో పెళ్లి వేడుకలో ఊహించని ఘటన జరిగింది. సతుపురలో పెళ్లివేడుకకు కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. కొత్త  జంట ఇద్దరు మంచి కాస్టూమ్స్ లు వేసుకున్నారు. అంతే కాకుండా.. వేడుకలకు బంధువులు, అతిథుతు పెద్ద ఎత్తున వస్తున్నారు. పెళ్లి సింపుల్ గా జరిగిపోతుందనుకున్నాడో.. ఏమో కానీ వరుడు అందరి ముందు కాస్తంతా వెరైటీ గా ప్రవర్తించాడు. వధువును అందరి ముందు పట్టుకుని గాలిలో పైకెత్తాడు. దీంతో వధువు ముఖంగా ఎర్రగా మారిపోయింది. వెంటనే అతని నుంచి వదలించుకుని వేదికపై నుంచి కిందకు దిగిపొయింది.


Read More: Election Commission 2024: రేపే ఎన్నికల నగారా.. ఏపీ సహా 4 రాష్టాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన..


వరుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అక్కడున్న వారంతా ఆమెను చూస్తు ఉండిపొయారు. చివరకు తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పేసింది. వరుడి అత్యుత్సాహాం వల్ల వధువు ఇలా చేసిందని సమాచారం. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీన్ని చూసిన నెటిజన్లు ఇదేందిరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter