Viral Video: బాప్ రే.. ఎంతకు తెగించింది.. కిచెన్‌లో మూత్రం పోసి చపాతీలు.. షాకింగ్ వీడియో వైరల్..
Uttar pradesh news: ఘజియా బాద్ లో ఒక పనిమనిషి చపాతి పిండిలో మూత్రం కలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ లు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Uttar pradesh maid mixing urine in owners food video: కొంత మంది ఇటీవల కాలంలో తమ ఉద్యోగాలలో బిజీగా ఉండటం వల్ల ఇంట్లో వంటలకు, ఇంటిపనికి గాను పనిమనుషుల్ని పెట్టుకుంటారు. చాలా వరకు పనిమనుషులు ఇంట్లో ఉన్న.. ఓనర్స్ ఒక కంట కనిపెడుతునే ఉంటారు. చాలా మంది సీసీ కెమెరాలను కూడా ఏర్పాట్లు చేస్తారు. అయితే.. కొంత మంది పనిమనుషులు మాత్రం తమ ఓనర్స్ కు ఎంతో నమ్మకంగా ఉంటారు. తమ పనితాము చూసుకుంటూ.. చుట్టుపక్కల ఏమున్న కూడా అస్సలు పట్టించుకోరు. పొరపాటున డబ్బులు పడి ఉన్న, మరే వస్తువు పడి ఉండటం కన్పిస్తే వెంటనే ఓనర్స్ కు చెప్పేస్తారు. ఎంతో నిజాయితీగా ఉంటారు.
కానీ మరికొందరు మాత్రం దొంగ చూపులతో అన్ని సీక్రెట్ గా చూస్తుంటారు. ఎక్కడ ఏం దొరుకుందో అని వెతుకుతూ ఉంటారు. పొరపాటు యజమాని పక్కకు వెళ్తే.. వస్తువుల్ని లేదా డబ్బుల్ని లటుక్కున తీసుకుని సీక్రెట్ ప్లేస్ లో దాచిపెడుతుంటారు. ఇదిలా ఉండగా.. ఘజియాబాద్ లో ఒక పనిమనిషి తన ఓనర్ ఇంట్లోనే దారుణానికి పాల్పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని ఘుజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రీనా అనే లేడీ పనిమనిషిని.. రియల్ ఎస్టేట్ వ్యాపారి నితిన్ గౌతమ్.. తన ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నారు. ఆమె ఇంటి పనితో పాటు, కిచెన్ లో వంటలు కూడా చేస్తుంటుంది. ఆమె కొన్నేళ్లుగా వీరి ఇంట్లో పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే.. ఇటీవల ఆమె సరిగ్గా పనిచేయక పోవడంతో ఆమె యజమానురాలు.. రూపమ్ గౌతమ్ పనిమనిషిని తిట్టింది. పని సరిగ్గా చేయాలని లేకుండా మానేయాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది .
దీంతో ఇంటి వాళ్ల మీద కోపం పెంచుకున్న పనిమనిషీ.. ప్రతిరోజు వాళ్లకు చేసే చపాతీలో తన మూత్రం కలపడం ప్రారంభించింది. దీంతో ఇంట్లో వాళ్లంతా కాలేయ సమస్యలతో ఆస్పత్రికి క్యూలు కట్టారు. ఈ క్రమంలో వైద్యులు... ఫుడ్ లో ఏదో కలుస్తుందని చెప్పారు. పనిమనిషి మీద అనుమానంలో కిచెన్ లో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరా పెట్టారు. అప్పుడు ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ పనిమనిషి కిచెన్ లోనే.. చపాతి పిండిలో మూత్రం పోసి.. దానిలోనే రోజు చపాతీలు, ఫుడ్ ఐటమ్స్ లు చేస్తుందని బైటపడింది. వెంటనే ఓనర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసుల్ని నమోదు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.