Man Dragged On Car Over 3 Kilometres in Ghaziabad: రోడ్డుపైన కొందరు ఇష్టమోచ్చినట్లు డ్రైవింగ్ చేస్తుంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు చెబుతున్న అస్సలు పట్టించుకోరు. తమ వాహనాన్ని రాష్ గా నడుపుతూ ఇతరుల వాహనాలను కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. కొందరు అజాగ్రత్తగా వాహనాలు నడిపించడం వల్ల, అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తునే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తప్పతాగి కొందరు రోడ్డు మీద అజాగ్రత్తగా వెహికిల్స్ నడిపిస్తుంటారు. తీరా.. కొన్నిసార్లు ఎవరైన అడ్డగించి తప్పని వారించిన కూడా అస్సలు పట్టించుకోరు. రివర్స్ లో వారిపైనే దాడులకు తెగబడుతుంటారు. కారును వ్యక్తుల మీదకు ఎక్కించడానికి కూడా వెనుకాడరు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు.. 


ఉత్తర ప్రదేశ్‌ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది.ఘజియాబాద్ జిల్లాలోని రోడ్డుమీద ఒక వ్యక్తి కారును ఇష్టమోచ్చినట్లు డ్రైవ్ చేశాడు. ఇది కాస్త పక్కనున్న మరోకారును ఢీకొట్టింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  ఈక్రమంలో రోడ్డుమీదకు వచ్చిన  కుల్దీప్ అనే వ్యక్తి నానా హంగామా చేశాడు. ఎదుటి వ్యక్తి కారును ఢీకొట్టడమే కాకుండా, బూతులు కూడా తిట్టాడు. మరో వ్యక్తి కూడా అంతే ప్రతిఘటించాడు.


తనకారుకు జరిగిన డ్యామేజ్ చెల్లించాక కదలాలని తెల్చిచెప్పాడు. దీంతో కోపంతో కారులో ఎక్కాడు. బాధితులు కారుకు అడ్డంగా నిలిచుని బానెట్ ను పట్టుకున్నాడు.  ఈ క్రమంలో కుల్దీప్ కారును 3 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు.  ఆ తర్వాత కొంత దూరం వెళ్లాక.. కిందక పడేలా చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.


Read More: Deepika Padukone: ప్రెగ్నెన్సీ డైట్ బయటపెట్టిన దీపికా పడుకోణె.. ఫోటోలు చూశారా..


కొందరు ఆపడానికి ప్రయత్నించిన కూడా స్పీడ్ గా వెళ్లిపొయాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో క్లియర్ గా ఇతగాడి రాష్ డ్రైవింగ్ రికార్డు అయ్యింది.  నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook