Uttar Pradesh Man Marries Sister To Get Govt Benefits: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం తమవంతుగా సహయం చేయడానికి అనేక పథకాలను ప్రవేశ పెడుతుంటాయి. కొన్నిసార్లు.. రుణాలు ఇస్తాయి. పెన్షన్ స్కీమ్ లు ప్రవేశ పెడుతుంటాయి. పంటల  రుణాలు, సబ్సీడీలు ఇస్తుంటాయి. కానీ కొందరు కేటుగాళ్లు ప్రభుత్వాలు చేసే సహాయాన్ని మిస్ యూజ్ చేస్తుంటారు.అర్హులైన పేదలకు అందాల్సిన సహాయాన్ని మోసం చేసి డబ్బులను కాజేస్తుంటారు. కొన్నిచోట్ల ఒకరికి బదులు మరోకరు ఫించన్లుతీసుకుంటారు. మరికొన్ని చోట్ల పెళ్లికాకున్న అయ్యిందని చెప్తుంటారు. ఇల్లు లేకున్న ఇల్లు తమదే అని చెప్పి, ప్రభుత్వాన్ని మోసం చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Venomous Snake: లోదుస్తులు పెట్టే ర్యాక్ లో ప్రపంచంలోనే రెండో అత్యంత విషసర్పం.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా..?


పూర్తివివరాలు.. 


ఉత్తర ప్రదేశ్‌ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సహాయం చేయడానికి సాముహిక పథకాలను అమలు చేస్తుంది. దీనిలో భాగంగా.. పేదలకు 35 వేలు ఆర్థిక సహయంగా ఇస్తారు. ఈక్రమంలో ఒక మహిళ.. ఒక ఐడియా వేసింది. మధ్య వర్తుల ద్వారా తను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పింది. ఒక ఫెక్ పెళ్లికోడుకును కూడా ఏర్పాటు చేశారు. కానీ తీరా పెళ్లి సమయానికి అతగాడు రాలేదు.


దీంతో సదరు మహిళ ఒక ప్లాన్ వేసింది. తన సోదరుడికే పెళ్లి కొడుకులా వేశంవేయించింది. అంతే కాకుండా.. అతడితోనే పెళ్లి తంతుకూడా కానిచ్చేసింది. తీరా పెళ్లి కార్యక్రమం జరిగాక.. వీరి అస్సలు బండారం బైటపడింది. పెళ్లి చేసుకున్న జంట అక్క తమ్ముళ్లనే విషయం తెలిసింది.


Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళకు ఇది వరకే ఒకసారి పెళ్లి జరిగింది. దీంతో అక్కడి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook