Man Sends Notice To Shopkeeper in UP: ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో వింత  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి అనే వ్యక్తి లాయర్ గా పనిచేస్తున్నాడు.  గత ఏడాది నవంబర్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది.  జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి, తన బావ కోసం పదిరోజుల నుంచి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మంచి షూస్ కోసం.. లోకల్ గా ఉన్న..  హుస్సేన్ షాపుకు వెళ్లాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ బ్రాండెడ్ బూట్లను సెలక్ట్ చేసుకున్నాడు. దానికి దుకాణాదారుడు బ్రాడెండ్ వని, వారంటీ కూడా ఇచ్చాడు. దీంతో బిల్ చెల్లించి ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే బూట్లు కొన్ని రెండు, మూడు రోజులకే పాడైపోయాయి. రంగు కూడా పూర్తిగా మారిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి ఆస్పత్రి పాలయ్యాడు. అతడిని కాన్పూర్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అతను తన బావ పెళ్లికి వెళ్లలేకపోయాడు. కొన్నిరోజులకు జ్ఞానేంద్ర భాన్ త్రిపాఠి కోలుకున్నాడు.


Read Also: Snakes: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..


ఆతర్వాత.. తనకు పాడై పోయిన బూట్లను అంటగట్టిన షాపు ఓనర్ కు బుద్ది చెప్పాలని భావించాడు. దీనిలో భాగంగా.. ఈ ఏడాది జనవరి 19న, త్రిపాఠి హుస్సేన్‌కి లీగల్ నోటీసు పంపించాడు. దుకాణా దారు అంటగట్టిన పాడైపోయిన బూట్ల కారణంగా మనో వేదనకు గురయ్యాయనని, త్రిపాఠి హుస్సేన్‌ను చికిత్స కోసం ఖర్చు చేసిన రూ.10,000, రిజిస్ట్రీకి రూ.2,100  జరిమానగా చెల్లించాలని డిమాండ్ చేశాడు.


అంతే కాకుండా.. తాను కొనుగోలు చేసిన షూలకు రూ.1,200 కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నివేదిక పేర్కొంది. దుకాణదారుడు పరిహారం చెల్లించకుంటే హుస్సేన్‌పై కేసు పెడతానని కూడా నోటీసులో హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook