Father tied his son: అధికంగా తింటున్నాడని తనయుడినే గొలుసులతో కట్టేశాడు
poor father`s ardeal: ఏ తండ్రి అయినా తన పిల్లలు కడపునిండితే తన కడుపు నిండినట్టే అని భావిస్తాడు. తనకు ఉన్నా లేకున్నా పిల్లలకు పెట్టి వారి ఆనందాన్ని చూసి సంతోషిస్తాడు. కానీ ఇక్కడ ఓ నిరుపేద తండ్రి ధీనగాథ మాత్రం అందుకు భిన్నమైనది. అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకును ( Father Tied Son With Chain ) గొలుసుతో కట్టేసిన పేద తండ్రి కథ ఇది.
poor father's ardeal: ఏ తండ్రి అయినా తన పిల్లలు కడపునిండితే తన కడుపు నిండినట్టే అని భావిస్తాడు. తనకు ఉన్నా లేకున్నా పిల్లలకు పెట్టి వారి ఆనందాన్ని చూసి సంతోషిస్తాడు. కానీ ఇక్కడ ఓ నిరుపేద తండ్రి ధీనగాథ మాత్రం అందుకు భిన్నమైనది. అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకును ( Father Tied Son With Chain ) గొలుసుతో కట్టేసిన పేద తండ్రి కథ ఇది.
ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాకు చెందిన కందేలాల్‌ది నిరుపేద కుటుంబం. కూలీ నాలీ చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో భారంగా బతుకీడుస్తున్న కందేలాల్‌పై మూగే నక్కపై తాటిపండు పడిన చందంగా కరోనావైరస్, లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపించాయి. లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో డబ్బుంటే సరుకులు తెచ్చుకుని తినడం... లేదంటే పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. కందేలాల్ కొడుకు విజయ్‌కి మాత్రం కుటుంబం కష్టాలు ఏమీ పట్టకపోగా.. ఇంట్లో అందరి కోసం వండి పెట్టిన ఆహారాన్ని మిగితా వారు తిన్నారా లేదా అని ఆలోచించకుండా తినేయడం ఇప్పుడు ఆ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఒక రోజు పనికి వెళ్లిన కందేలాల్ కుటుంబసభ్యులు పని నుంచి తిరిగి వచ్చి.. అన్నం తిందామని కూర్చుంటే ఇంట్లో వండిన అన్నం లేదు. విజయ్ మొత్తం లాగించేశాడు. పోనీ మళ్లీ వండి తిందాం అంటే ఇంట్లో గింజ ( Food Grains ) కూడా లేదు. దీంతో కుటుంబం మొత్తం ఆ రోజు నీళ్లు తాగి పడుకోవాల్సి వచ్చింది. కానీ మరుసటి రోజు నిద్రలేవగానే విజయ్‌పై కోపంతో అతన్ని చైన్‌తో కట్టేశారు. అతనికి తిండి విలువ ఏంటో నేర్పాలి అనుకున్న తండ్రి.. గుర్తొచ్చినప్పుడు మాత్రమే తిండి పెట్టే వాడు.
దీంతో విజయ్ బాగా నీరసించిపోయాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అతనికి తిండిపెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కందెలాల్ ఇంటికి చేరుకున్న పోలీసులు తండ్రిని ప్రశ్నించగా.. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ( Financial crisis ).. అయినా కానీ తన కొడుకు పని చేయకుండా ఇంట్లో ఉంటూ అందరి అన్నం తినేస్తున్నాడు అని వివరించాడు. కందెలాల్ ఆవేదన విన్న పోలీసులు కూడా కరిగిపోయారు. ఈ విషయంలో మానవతా ద్రుక్పథంతో మాత్రమే వ్యవహరించగలం అని.. విజయ్‌ను ఆసుపత్రికి తరలించారు.