Vande Bharat Express: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కి టీటీకు అడ్జంగా బుక్కైన వ్యక్తి, వీడియో వైరల్
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. సెల్ఫీకు షో కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. భారీ పెనాల్టీ చెల్లించుకోవల్సి వచ్చింది.
ఇది మాములు రైలు కాదు. వందేభారత్. ఎంత షోగా ఉంటుందో అన్నే ఆంక్షలుంటాయి. సాధారణ రైళ్లలా ఇష్టమొచ్చినట్టు ఎక్కి దిగేందుకు వీల్లేదు. అలా చేస్తే ఇదిగో ఇలానే భారీ జరిమానా చెల్లించుకోవల్సి వస్తుంది. అదే జరిగిందిప్పుడు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. వందేభారత్ బాగా ట్రెండ్ అవడంతో రైలెక్కి సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారు చాలామంది. ఆ కోరికతోనే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుందామని రైలెక్కి అడ్డంగా బుక్కయ్యాడు. ఆటోమేటిక్ డోర్స్ కావడంతో సెల్ఫీ దిగుతున్నప్పుడు డోర్స్ క్లోజ్ అయ్యాయి. అంతే టీటీకు అడ్డంగా బుక్కయ్యాడు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
ఓ మధ్య తరగతి వ్యక్తి ఇలానే రాజమండ్రి స్టేషన్‌లో ఆగిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ చూసి టెంప్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం లోపలకు వెళ్లాడు. ఫోటోలు దిగుతుండగా..ఆటోమేటిక్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. మళ్లీ మరో స్టేషన్ వస్తే గానీ తెర్చుకోవని తెలియని ఆ వ్యక్తి డోర్స్ తెరిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో అటుగా వచ్చిన టీటీకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ నుంచి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి స్టేషన్ చేరుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. డోర్స్ ఓపెన్ చేసి తనను బయటకు పంపించాల్సిందిగా టీటీని ప్రాధేయపడుతున్న దృశ్యం కెమేరాలో రికార్డైంది. ఆటోమేటిక్ డోర్స్ కావడంతో తానేం చేయలేనని చేతులెత్తేశాడు టీటీ.
అంతేకాదు..తప్పనిసరిగా ఆ వ్యక్తి విజయవాడ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినందుకు విజయవాడ వరకూ 6 వేల రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది. అక్కడితో ఆగదు అతని నష్టం. విజయవాడ నుంచి తిరిగి రాజమండ్రి వచ్చేందుకు ఇంకొంత ఖర్చుపెట్టాల్సిందే.
ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే వర్చువల్‌గా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్ని కలిపే తొలి వందేభారత్ రైలు కాగా, దక్షిణ భారతదేశంలో రెండవది. దేశం మొత్తం మీద ఇది 8వ రైలు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్యలో ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు 700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Also read: Lion Man Viral Video: ఐదు పెగ్గులు వేస్తే.. సింహంతో కూడా ఆటాడుకోవచ్చు! నమ్ముకుంటే ఈ వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook