Chocolate Banana Dosa Video Goes Viral: ప్రతిరోజు ఉదయాన్నే కొందరు బ్రేక్ ఫాస్ట్ తినందే బైటకు అస్సలు వెళ్లరు. కొందరు ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు, ఉత్తప్ప, పోహా ఇలా ఎవరికి ఏది వీలైతే అది తింటుంటారు. ఇదిలా ఉండగా.. చాలా మంది ఫుడ్ లవర్స్ దోశలను ఎంతో ఇష్టంతో తింటారు. దీంతో దోశలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకారకాల ఫుడ్ స్టాల్ లకు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొందరు రోడ్ల మీద.. చూడటానికి చిన్న స్టాల్ ఉంటుంది. కానీ  వారిదగ్గర ఉండే టెస్టీకి ఫైవ్ స్టార్ చెఫ్ కూడా పనికిరాడు. అంత బాగా వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ లను వండుతుంటారు. అంతేకాకుండా..వీరి ఫుడ్ ప్రిపరేషన్ కు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. సోషల్ మీడియాలో వెరైటీ ఫుడ్ కాన్సెప్ట్ కు చెందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారీ దోశ తయారీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఒక ఫుడ్ స్టాల్ వద్ద సదరు చెఫ్ దోశలు చేస్తున్నాడు. అతగాడి వద్ద దోశలు తినడానికి జనాలు క్యూలో కూడా ఉన్నారు. అతను వేడి వేడి పెనం మీద.. దోశపిండిని తీసుకుని, పెనం మీద రౌండ్ గా పోశాడు. ఆ తర్వాత దోశగిన్నెతో అన్నివైపులా సమపాళ్లలో పిండి అతుక్కునేలా చేశాడు. ఆతర్వాత దానిమీద చాక్లెట్ ముక్కలను కూడా వేశాడు. దాన్ని తనచేతిలో ఉన్న గరాటుతో అన్నివైపులకు సమపాళ్లలో దోశకు అద్దాడు. ఆతర్వాత.. రెండు అరటి పండ్లను తీసుకున్నాడు. వాటిని ముక్కలుగా చేసి, దోశలమీద పెస్ట్ చేశాడు.


కాసేపు దోశను పెనంమీద వేడి అయ్యేలా చేశాడు. ఆతర్వాత దోశలను ముక్కలుగా చేసి, కస్టమర్లకు అందించాడు. ఈ దోశ ప్రిపరేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తయారీ విధానం తరచుగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటారు. దీంతో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోయిన సంఘటనలు కొకొల్లలు. దీంతో చాలా మంది వారి జీవితంలో అస్సలు ఊహించని విధంగా మారిపోయిన ఘటనలు ఇప్పటికే వార్తలలో కూడా నిలిచాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook