Venomous snake started eating its own tail video goes viral: పాములను చూసి చాలా మంది భయంతో పారిపోతుంటారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. అడవులు, గుబురుగా ఉండే చెట్ల వద్ద పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే స్నేక్ సొసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం.. పాముల్ని చూసి దూరంగా వెళ్లిపోతుంటారు. కొన్నిసార్లు పాములు కాటు వేస్తుంటాయి. దీంతో కొందరు పాముల మీద శాడిజం చూయిస్తుంటారు. పాములకు చెందిన వీడియోలను తరచుగా వైరల్ గా మారుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నెటిజన్లుకూడా పాముల వీడియోలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని వెరైటీగాను, మరికొన్నిషాకింగ్ కు గురిచేసేవిలా కూడా  ఉంటాయి. ఎలుకల కోసం పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పాములను చంపితే.. కాలసర్పదోషం చుట్టుకుంటుందని పెద్దలు, పండితులు చెప్తుంటారు. అందుకే పాముల్నిఎట్టి పరిస్థితుల్లో ఆపద కల్గించకూడదు.. పాములకు చెందిన ఒక  వెరైటీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..


సాధారణంగా పాములు ఎలుకల్ని తినేస్తుంటాయి. మరికొన్ని పాములు, తమకన్నా.. చిన్న పాముల్ని మింగేస్తుంటాయి. ఇదంతా కామన్ గా జరిగేదే.. కానీ @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఇక్కడ మాత్రం పాము వెరైటీగా తన తోకను తానే తినేస్తుంది. అది ఏదో ఇతర జీవిని తింటున్నట్లు తనకు తానే.. మింగేసుకుంటుంది. దాదాపు సగం వరకు పాము మింగేస్తు వచ్చింది.


Read more: Keerthy suresh: నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదుగా.. బాంబు పేల్చిన కీర్తిసురేష్..


ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాబోయ్.. ఇదేం పాము అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం..పాము తనకు తానే తినేస్తే.. బాధగా ఉండదా.. అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం..పాము తోకను తినడమేంటని వింతగా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter