Keerthy suresh: నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదుగా.. బాంబు పేల్చిన కీర్తిసురేష్..

Keerthy suresh comments on relationship: కీర్తిసురేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు ఈ విషయంపై మాకు క్లారీటి ఇవ్వాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

1 /9

కీర్తిసురేష్ ఇటీవల పెళ్లికి సంబంధించిన ట్రోలింగ్స్ తో తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమెను నిత్యం ఒకరితో రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి సెటిల్ అయ్యిందని కూడా వార్తలు షికార్లు కొడుతున్నాయి.   

2 /9

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో రూమర్స్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ లు సైతం ఇస్తుంటారు. ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ సాధించిన కల్కీ 2898 AD మూవీలో బుజ్జీ చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు. ఈ మూవీకి బుజ్జీ ఒక మెయిన్ రోల్ ప్లే చేసిందని కూడా చెప్పుకొవచ్చు.

3 /9

ఈ బుజ్జీ వెహికిల్ కు కీర్తి సురేష్ తన వాయిస్ ను ఇచ్చారు. ఈ బుజ్జీకి కూడా కీర్తి సురేష్ సరిగ్గా సరిపోయింది. దీంతో ప్రస్తుతం కీర్తిసురేష్ వాయిస్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల కీర్తిసురేష్ ఒక ఇంటర్వ్యూల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. 

4 /9

కీర్తీ సురేష్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో తాను .. ఎన్నోరకాలుగా ట్రోలింగ్ కు గురయ్యానని, దక్షిణాదిన నా అంతా ఏ హీరోయన్ కూడా ట్రోల్స్ బారిన పడి ఉండకపోవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

5 /9

కెరిర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కానీ అవన్ని ఎదుర్కొని ఇప్పుడు రాణిస్తున్నానని కీర్తిసురేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనేక మూవీస్ లో బిజీగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. 

6 /9

ఈ క్రమంలో యాంకర్.. బోర్ కొట్టడం లేదా.. సింగిల్ గా ఉన్నారు..?.. అంటూ ప్రశ్నించింది. దీంతో కీర్తిసురేష్ తాను.. ఒంటరిగా ఉన్నానని చెప్పలేదుగా అంటూ క్యూట్ గా నవ్వుతూ బాంబు వేశారు. దీంతో యాంకర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

7 /9

అంతేకాకుండా.. తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి కాలమే సమాధానమే చెప్తుందని కూడా గట్టిగా ఇచ్చిపారేశారు.  నేను వాటిని పెద్దగా పట్టించుకొనని కూడా కుండబద్దలు కొట్టేశారు. 

8 /9

ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’. దీన్ని సుమన్‌కుమార్‌ తెరకెక్కించారు. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. ఆగస్టు 15న ఇది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కీర్తిసురేష్ ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనిలో హీరోగా వరుణ్ ధావన్ నడిస్తున్నారు.   

9 /9

ప్రస్తుతం ఇంటర్వ్యూకు సంబంధించిన  వీడియోకు సోషల్ మీడియలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు .. కీర్తిసురేష్ తో డేటింగ్ లో ఉన్నది ఎవరబ్బాఅని బుర్రలు బద్దలు కొట్టుకొంటున్నారు. మరికొందరు కీర్తిసురేష్ తో రిలేషన్ లో ఉన్నా.. హీరో గురించి ఏదైన క్లూ ఇస్తే బాగుండేదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.