Bizarre food Combination: పానీ పూరి అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు.. లొట్టలేసుకుంటూ ప్లేట్లకు ప్లేట్లు లాగించేస్తుంటారు చాలామంది. అయితే ఇలాంటి కాంబినేషన్‌లో పానీ పూరి తినడానికి మాత్రం కాస్త గట్స్ ఉండాల్సిందే. సాధారణంగా పానీ పూరి అంటే.. పూరిలో కాస్త చోలే మసాలా పెట్టి రసం కాంబినేషన్‌తో సర్వ్ చేస్తారు. కానీ ఇక్కడ చట్నీ, ఐస్‌క్రీమ్ కాంబినేషన్‌తో క్రీమ్ రోల్స్‌లా వాటిని సర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను గమనిస్తే.. ఆ రెసీపీ ప్రిపేర్ చేస్తున్న వ్యక్తి మొదట పానీ పూరిలో చోలే, ఆలూని పెట్టాడు. ఆ తర్వాత చట్నీ వేశాడు. ఆపై పానీ పూరిపై క్రీమ్‌ను పోశాడు. నెక్స్ట్ స్టెప్‌లో ఆ పానీ పూరిని పూర్తిగా స్మాష్ చేసి క్రీమ్‌తో మిక్స్ చేసి రోల్స్ చేశాడు. అంతే.. చట్నీతో పానీ పూరి ఐస్‌క్రీమ్ రోల్స్ రెసిపీ తయారైనట్లే. 'ది గ్రేట్ ఇండియన్ ఫుడీ' అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటివరకూ 7వేల పైచిలుకు మంది దీన్ని వీక్షించారు.


ఈ వీడియో (Viral Video) చూసిన నెటిజన్లలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆ రెసిపీ నచ్చలేదు. కొంతమంది దీనిపై ఫన్నీ కామెంట్లు చేయగా... మరికొందరు చెప్పరాని భాషలో తిట్టారు. కొంతమంది నెటిజన్లు.. 'ఇక మీ పేజీని అన్‌ఫాలో చేస్తున్నా... ఇలాంటి దారుణమైన కాంబినేషన్స్ ఇక ఆపండి..' అని కామెంట్ చేశారు. 'ఇలాంటి నేరానికి నరకంలోనూ చోటు ఉండదు... గరుడ పురాణంలో ఇలాంటి వాటికి ప్రత్యేక శిక్షలు రాయబడ్డాయి.' అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 



Also Read: Liquor in Supermarkets: మందుబాబులకు గుడ్ న్యూస్.. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.