Viral Video: గ్రామస్తులంతా ఒక్కటై గ్రామంలోకి వచ్చిన చిరుతపులిని చితక్కొట్టారు. తమపై దాడి చేస్తుందనే భయంతో రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఫలితంగా ఆ పులి బెంబేలెత్తి పోయింది. అయితే పులిపై గ్రామస్తులంతా విచక్షణారహితంగా దాడి చేస్తుండడంతో అందరూ పులిపై జాలిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Insta Reels Viral: ఎవడ్రా నన్ను ఆపేది.. ట్రాఫిక్‌ ఆపి రోడ్డుపై కుర్చీ వేసుకుని ఇన్‌స్టా రీల్స్‌


ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌ జిల్లాలోని హత్యా అనే గ్రామంలోకి చిరుతపులి ప్రవేశించింది. అటవీ ప్రాంతం సమీపంలో ఉండడంతో అక్కడి నుంచి గ్రామంలోకి పులి అడుగుపెట్టింది. పులి రాకతో గ్రామంలో తీవ్ర భయాందోళన ఏర్పడింది. ఎవరిపై దాడి చేసి ఎవరి చంపి తింటుందోనని గ్రామస్తులంతా భయపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులతోపాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారులు రావడంతో కొంత ధైర్యం తెచ్చుకున్న గ్రామస్తులు అందరూ ఒక్కచోటకు చేరుకున్నారు.

Also Read: Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు


చిరుతపులిని వెళ్లగొట్టేందుకు గ్రామస్తులంతా కర్రలు, రాళ్లతో బయల్దేరారు. ఈ క్రమంలో ఓ ఇంట్లోకి పులి దూరింది. పులి ఎప్పుడు బయటకు వస్తుందా అని గ్రామస్తులు నిరీక్షించారు. మరికొందరు ఆ భవనంపైకి చేరుకుని పులిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రజల అరుపులు కేకలతో ఇంట్లో దాగి ఉన్న పులి బయటకు వచ్చింది. అయితే అప్పటికే బయట కాచుకు నిలబడ్డ ప్రజలు పులిపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. గ్రామస్తుల మూకుమ్మడి దాడితో చిరుతపులి తీవ్రంగా గాయపడింది. అయితే అంత గాయపడినా కూడా పులి వెంటనే తేరుకుని మళ్లీ ఇంట్లోకి దూరింది. 


అనంతరం అతి కష్టంగా ఆ చిరుతపులిని అటవీప్రాంతంలోకి తరలించారని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గ్రామస్తులు పులిని తరిమికొడుతున్న వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పాపం అని జాలిపడుతుండగా.. కొందరు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటున్నా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని మండిపడుతున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter