Viral news: జుట్టు ఊడిపోయిందని యువకుడు ఆత్మహత్య
Viral news: జుట్టు ఊడిపోయిందని తీవ్ర మనస్తాపం చెంది ఓ యువకుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Viral news today: కోజికోడ్ జిల్లాలోని అథోలికి చెందిన 29 ఏళ్ల యువకుడు జట్టు రాలిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురై సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించారు.
కేసు దర్యాప్తు అధికారి పి కె మురళి మాట్లాడుతూ.. కేరళలోని అథోలికి చెందిన ప్రశాంత్.. 2014 నుంచి కొజికోడ్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జుట్టు రాలకుండా ఉండేందుకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వాడినా సరే రోజులు గడిచేకొద్ది అతడి జట్టు మరింత రాలడం మెుదలుపెట్టింది. చివరకు తల సహా కనుబొమ్మలపై జట్టు కూడా ఊడిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రశాంత్‌కు హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలిపోయిందని కోజికోడ్‌లో (Kozhikode district) అతనికి చికిత్స చేసిన డాక్టర్ తెలిపారు. అతను తామరస్సేరిలోని ఒక వాహన షోరూమ్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జట్టురాలడమే తన పెళ్లి ప్రతిపాదనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని ప్రశాంత్ సూసైడ్ నోట్ లో పేర్కోన్నాడు. తల ఊడిపోవడంతో అతడు ఫంక్షన్లకు హాజరుకావడం, స్నేహితులను కలవడం కూడా మానేశాడు.
తనకు వైద్యం వికటించడం వల్లనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ యువకుడు పేర్కొన్నాడు. ప్రశాంత్ మృతిపై విచారణ జరిపించాలని కుటుంబసభ్యులు ఇప్పటికే అథోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ మృతికి కారణమైన డాక్టర్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశామని, వైద్యుడి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని దర్యాప్తు అధికారి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వైద్యపరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని... విచారణ వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Also Read: Thief Ran Into Glass: చోరీ చేసి పారిపోతూ సినీఫక్కీలో అడ్డంగా చిక్కిన దొంగ.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook