COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral News: భారతదేశం విభిన్న సాంస్కృతుల సమ్మేళనం..భారత్‌లో దాదాపు అన్ని దేశాల వారు నివసిస్తారు. అందుకే విభిన్న దేశాల ఆచారాలను అనుసరించడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా చాలా మంది ఇప్పటికీ పూర్వీకులు అనుసరించిన ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కి మంచి గుర్తింపు లభించింది. దేశంలో కొంతమంది ఆచరించే ఆచరాలు, విభిన్న సాంస్కృతులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఏపీలో ఏలూరు జిల్లాలో వింత ఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
  
ఇటీవలే ఏలూరు జిల్లా దొరసానిపాడులోని  వింత ఘటన జరిగింది. ఓ  ఆశ్రమంలో బాబా పెద్ద ఎత్తున కారంతో భక్తులు అభిషేకించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దొరసానిపాడులోని శ్రీశివ దత్తాత్రేయ వృద్ధాశ్రమంలో ఓ స్వామికి భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర గ్రామల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివ స్వామికి ఎర్రని కారంతో అభిషేకం చేస్తున్నారు. దీంతో పాటు స్వామీజీ ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సాయంత్ర పూట దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


స్వామిని కారంతో అభిషేకించే కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కన ప్రాంతాల వాసులు కూడా తరలివస్తున్నారు. ఇప్పటి వరకు స్వామివారికి 50 కేజీలలకుపైగా ఎర్రటి కారంతో అభిషేకం చేశారని సమాచారం. నరసింహస్వామి హిరణ్యకశికుడిని వధించే క్రమంలో ప్రత్యంగరి దేవి ఉద్భవిస్తుందని పూరణాల్లో పేర్కొన్నారు. అయితే ఈ దేవి ఎండు మిరపకాయలు, కారం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ అమ్మవారు ఎండు మిరపకాయలను మెడలో హారంగా ధరిస్తుందని సమాచారం.


శివ స్వామికి ఈ సమయంలో కారంతో అభిషేకం చేయడం వల్ల బాధలతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శత్రువినాశనం కూడా జరుగుతుంది. ఈ స్వామిని దర్శించుకుంటే ఇక ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కార్తీక బహుళ తదియ రోజున ఇలా స్వామివారికి కారంతో అభిషేం చేయడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది.  


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి