Viral News: నెట్టింట్లో వైరల్ అవుతున్న నల్ల టమాటోలు..మీరెప్పుడైనా వీటిని చూశారా?
Black Tomato: చాలామంది ఎరుపు రంగు టమాటోలను చూసుంటారు కానీ మేము ఈరోజు మీకు నలుపు రంగు టమాటోలను చూపించబోతున్నాం. వీటిని ఆహారంలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
Black Tomato: ఈమధ్య టమాటోల రేట్లు ఆకాశాన్నంటిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంత రేట్లున్న కొనడం తినడం మాత్రం ఖాయం. ఎందుకంటే టమాటోతో వండిన ఆహారాలు నోటికి ఎంతో రుచి అందిస్తాయి. మనం మార్కెట్లో తరచుగా ఎర్ర టొమాటో చూస్తూ ఉంటాము. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో దోరగా ఉన్న కాయల్ని కూడా చూసి ఉంటారు. అయితే మేము ఈరోజు మీరు ఎప్పుడూ చూడని రంగు టమాటోను ఈరోజు చూపించబోతున్నాము. అంతేకాకుండా దీనివల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించబోతున్నాం.
మీరు తరచుగా ఎరుపు రంగు టమాటోలను చూసుంటారు. ఎప్పుడైనా నలుపు రంగు టమాటోలను చూశారా.? అందరికీ సందేహం కలగవచ్చు ఏంటి నలుగురంగు టమాటోలు కూడా ఉంటాయా అని.! వారందరికీ అవునని సమాధానం మా దగ్గర ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో నలుగురంగు టమాటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
ఈ నల్ల టమాటోలు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతాయని సమాచారం. వీటి విత్తనాలు కూడా నలుపు రంగులో ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ టమాటోలతో తయారు చేసిన ఆహార పదార్థాలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో పోషక విలువలు కూడా అధిక మోతాదులో లభిస్తాయి.
ప్రస్తుతం టమాటో రేట్లు అమాంతం పెరగడం వల్ల ఈ నల్ల టమాటోలు కూడా ఎవరూ ఊహించని స్థాయిలో రేట్లు పెరిగాయి. దీంతో ఇవి పండించిన రైతులు ఎంతో ఆనంద పడుతున్నారు. అయితే అయితే కొన్నిచోట్ల టమాటో రేట్లు అధికంగా పెరగడం కారణంగా ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది దీంతో ప్రభుత్వాలు దిగివచ్చి టమాటోలను సబ్సిడీలో విక్రయించించాయి.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి