Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!
Viral News: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిమ్మకాయలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతు మార్కెట్లో నిమ్మకాయలకు భారీ ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలో నిమ్మకాయలపై సోషల్ మీడియా ఫన్నీ జోక్స్ పేలుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ వైరల్ గా మారింది. అదేంటో మీరూ చూడండి.
Viral News: మార్కెట్లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయల ధరలపై తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీంతో నిమ్మకాయల ధరలపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్, జోక్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన పిక్ నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా ఇంటి దిష్టి కోసం నిమ్మకాయలు, ఎండు మిర్చి కలిపి గుమ్మానికి కట్టేవారు ఉన్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకాయ, ఎండు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఓ వ్యక్తి తన ఇంటి గుమ్మానికి పచ్చి మిర్చితో పాటు నిమ్మకాయ స్థానంలో వెల్లుల్లితో దిష్టి గుమ్మానికి కట్టాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫోటో షేర్ చేసిన ఐపీఎస్ అధికారి..
ఈ ఫన్నీ ఫోటోను ఐపీఎస్ అధికారి రూబిన్ శర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానికి ఓ ఫన్నీ టైటిల్ కూడా పెట్టాడు. తన శీర్షికలో 'పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని.. నిమ్మకాయ లేకపోవడం వల్ల వెల్లుల్లిని డిప్యూటేషన్‌పై ఉంచారు. ఇప్పుడు ఈ పనికి వెల్లుల్లి బాధ్యత వహిస్తుంద"ని రూబిన్ శర్మ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Idly Ice Cream: ప్రపంచలోనే అతి చెత్త ఫుడ్ కాంబినేషన్.. చూస్తే కోపం సంగతి ఏమో కానీ వాంతులు పక్కా!
Also Read: Shocking News: పగబట్టిన నాగుపాము.. ఒకే వ్యక్తిని 7 సార్లు కాటేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook