Viral news: ఆ కుర్రాడు సెల్ఫీలతో కోట్లు సంపాదించాడిలా..!
Viral news: ఇండోనేషియాలో ఓ విద్యార్థి తన సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు. ఎలా అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ చదివేయండి.
Viral news: అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రకరకాలుగా సెల్ఫీలు (selfies) తీసుకుని ఆనందిస్తుంటాం. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూసుకుంటాం. అయితే అదే సెల్పీలు ఓ కుర్రాడిని మాత్రం కోటీశ్వరుడిని చేశాయి. కేవలం ఫోటోలతో కోట్లు సంపాదిస్తున్నాడు ఇండోనేషియాకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు.
వివరాల్లోకి వెళితే...
ఇండోనేషియాలోని సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీలో సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ (Sultan Gustaf Al Ghozali) అనే యువకుడు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అయితే ఐదేళ్లుగా తన కంప్యూటర్ ముందు కూర్చొని సరదాగా సెల్పీలు తీసుకునేవాడు. గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా ఆ సెల్ఫీలు అన్నింటితో కలిపి ఓ టైమ్‌లాప్స్ వీడియో చేద్దామనుకున్నాడు. అయితే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకున్న సుల్తాన్ తన సెల్ఫీలను ఆన్‌లైన్‌లో ఎన్‌ఎఫ్‌టీలుగా (non-fungible tokens) అమ్మకానికికు పెట్టాడు. జనవరి 10న ‘''ఘొజాలి ఎవిరీడే''’ (Ghozali Everyday) పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్కోదాని ధర 3 డాలర్లగా (రూ.223) నిర్ణయించాడు.
Also Read: Funny Viral Video: మీ భర్త ఫోన్ లో ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ వాడండి!
ఊహించని విధంగా ఆ సెల్ఫీలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు జనాలు. ఘొజాలి సెల్ఫీని ఎన్‌ఎఫ్‌టీగా (NFT) కొన్నట్లు ఓ సెలబ్రిటీ షెఫ్ ట్వీట్ చేశారు. అంతే.. అతడి స్వీయ చిత్రాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 21కల్లా.. 500 మందికిపైగా ఈ సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా అతడి ఖాతాలో 384 ఎథెర్ కాయిన్స్ వచ్చి చేరాయి. ఎథెర్ అంటే.. బిట్‌కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీ (Crypto Currency). 384 ఎథెర్‌ల విలువ.. 10 లక్షల డాలర్లకుపైనే. అంటే దాదాపు రూ.7.5 కోట్ల రూపాయలు. నిజానికి తన సెల్ఫీలను ఎవరు కొనాలని సుల్తాన్ అనుకోలేదట.. కేవలం సరదాగా పెట్టాడట. కానీ కోట్లలో డబ్బు వచ్చిందని సుల్తాన్ అంటున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి