Funny Viral Video: మీ భర్త ఫోన్ లో ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ వాడండి!

Funny Viral Video: భార్యభర్తల మధ్య చిలిపిగా ఆటపట్టించుకునే విషయాలు కోకొల్లలు. అయితే అలాంటి ఆటపట్టించే వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి అనూహ్యమైన రీతిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. మొబైల్ లో తన భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు భార్య చాలా తెలివిగా ఆలోచించి పట్టుకుంది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 04:49 PM IST
Funny Viral Video: మీ భర్త ఫోన్ లో ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ వాడండి!

Funny Viral Video: సోషల్ మీడియా వేదికగా అనేక షాకింగ్ వీడియోలు సహా ఫన్నీ వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటితో పాటు భార్య భర్తల మధ్య జరిగే చిలిపి వేషాలూ ఇందులో ఎప్పటికప్పుడు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చిన ఓ ఫన్నీ వీడియో ఆకట్టుకుంటోంది. 

మొబైల్ లో భర్త సీక్రెట్ గా ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు భార్య స్మార్ట్ గా ఆలోచించింది. అదే సమయంలో భర్త.. మరో అమ్మాయిల ఫొటోలను చూస్తున్నాడు. భార్య తెలివిగా ఆలోచించి.. భర్తను అడ్డంగా పట్టుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 

ఏం జరిగిందంటే?

భార్య, భర్తల మధ్య జరిగిన ఓ సంఘటన.. సోషల్ మీడియాలో అందరికి నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భర్త.. తన భార్యకు కనపడకుండా.. సీక్రెట్ గా మొబైల్ లో అమ్మాయిల ఫొటోలను చూస్తున్నాడు. అయితే అతడ్ని అడ్డంగా పట్టుకునేందుకు భార్య తెలివైన పని చేసింది. అతడి భార్య తెలివి తేటలు చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. 

బెడ్ పై భార్యభర్తలు ఇద్దరూ ఎదురెదురుగా పడుకొని ఉన్నారు. భర్త హాయిగా మొబైల్ చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో భర్త సీక్రెట్ గా అమ్మాయిల ఫొటోలను చూస్తున్నాడు. అదే సమయంలో భర్తపై అనుమానంతో భార్య తెలివైన పని చేసింది. 

తన కాలి వేళ్ల సహాయంతో అద్దం పట్టుకొని.. భర్త మొబైల్ లో ఏం చేస్తున్నాడో చూసింది. అమ్మాయిల ఫొటోలను చూడడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అయితే తన భార్య ఎదుట పట్టుబడినట్లు తెలుసుకొని.. భయపడిపోయాడు. ఈ టెక్నిక్ ను చూసిన పలువురు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. black_lover__ox అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడా వీడియోకు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.   

Also Read; Remedy for Financial Problems: తమలపాకుల వినియోగంతో ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టండిలా!

Also Read: Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News