Viral News: 10 రూపాయల నోటుపై ప్రేమ సందేశం.. ఫొటో వైరల్!
Viral News: నిత్యం ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చ జరిగే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రేమ సందేశం వైరల్ గా మారింది. 10 రూపాయల నోటుపై ఓ అమ్మాయి తన ప్రియుడి కోసం సందేశాన్ని పంపింది. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
Viral News: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రేమ సందేశానికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది. అయితే ఆ ప్రేమ సందేశాన్ని రాసింది కాగితంపై కాదు.. 10 రూపాయల నోటు మీద! ఆ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారిన నేపథ్యంలో.. నెటిజన్లు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ నోటుపై ప్రేమ లేఖ ఎవరు ఎవరికోసం రాశారో తెలుసుకుందాం.
కుసుమ్ అని అమ్మాయి.. తన ప్రియుడు విశాల్ కు ఈ ప్రేమ సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రేమ లేఖను పది రూపాయల నోట్ పై రాసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ ప్రేమ సందేశం ప్రకారం.. ఏప్రిల్ 26న కుసుమ్ వివాహం జరగనుందట. ఈ లోపు తాను ప్రేమించిన విశాల్ కు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ పెళ్లి జరిగే లోగా తనను పెళ్లి నుంచి తప్పించమని ఆమె అందులో కోరింది.
ఈ ప్రేమ సందేశానికి సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఈ పోస్ట్ ను షేర్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "ఈ లెటర్ విశాల్ కు చేరే లోపు ఇద్దరు పిల్లల తండ్రి అవుతాడ"ని కామెంట్స్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఫన్నీ మీమ్స్ కూడా వస్తున్నాయి.
Also Read: Idly Ice Cream: ప్రపంచలోనే అతి చెత్త ఫుడ్ కాంబినేషన్.. చూస్తే కోపం సంగతి ఏమో కానీ వాంతులు పక్కా!
Also Read: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook