Teacher And Student Romantic Photoshoot: విద్యార్థులు, టీచర్లు సభ్య సమాజానికి ఏం మెసెజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. తాజాగా పదో తరగతి విద్యార్థితో రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఓ లేడీ టీచర్. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)కి ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయురాలు తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన కర్నాటకలోని మురుగమల్లా చిక్కబళ్లాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు, టీచర్లు టూర్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ స్డూడెంట్, ఓ టీచర్ రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందులో ముద్దులు పెట్టుకోవడం, ఎత్తుకోవడం, రొమాంటిక్ గా చూడటం వంటి దృశ్యాలు ఉన్నాయి. ఇవి కాస్తా వైరల్ కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు బీఈవోకి ఫిర్యాదు చేశారు. టీచర్, విద్యార్థి ఎవరనేది తెలియరాలేదు. 



Also Read: Tiger viral video: ఇదేం పులి రా బాబు.. దాడి చేయడానికి వచ్చి హాయిగా గోడపై నిద్రపోయింది..


అయితే ఈ ఫోటోలు మరియు వీడియోకు విపరీతమైన లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. టీచర్ తన విద్యార్థికి ప్రేమ భంగిమలలో ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తున్నారని ఒకరు కామెంట్ చేస్తే.. ఇందులో తప్పేముందని మరొకరు వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకుంటే ఇద్దరిపైనే తీసుకోవాలని మరొకరు చెప్పారు.  ఫిర్యాదును స్వీకరించిన బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. 


Also Read: Viral Video today: ఈ బుడ్డది మామూల్దీ కాదు.. ఏకంగా 7 భాషలు తడబడకుండా మాట్లాడేస్తోంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook