Tiger viral video: ఇదేం పులి రా బాబు.. దాడి చేయడానికి వచ్చి హాయిగా గోడపై నిద్రపోయింది..

Viral Video today: సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో పులి, పాము వంటి యానిమల్స్ వీడియోలే అధికంగా ఉంటున్నాయి. తాజాగా ఓ పులి జనావాసాల్లోకి వెళ్లి కూడా దాడి చేయకుండా నిద్రపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2023, 07:39 PM IST
Tiger  viral video: ఇదేం పులి రా బాబు.. దాడి చేయడానికి వచ్చి హాయిగా గోడపై నిద్రపోయింది..

Tiger Video Viral: పులి పేరు వింటేనే గజ గజ వణికిపోతుంది. అలాంటి పులి ఊరిలోకి వస్తుందంటే మన గుండెలు అదిరిపోతాయి. ఈ మధ్య పులులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు పులి.. జంతువులను వేటాడటం, మనుషులపై దాడి చేయడం చూసూంటాం. కానీ ఓ పులి జనవాసాల్లోకి వచ్చి హాయిగా నిద్రపోవడం ఎప్పుడైనా చూశారా. అలాంటి ఘటనే తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో (Pilibhit district) చోటుచేసుకుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఈ క్లిప్ ఇంటర్నెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

సోమవారం రాత్రి ఫిలిబిత్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్టుకు దగ్గరలో ఉన్న అత్‌కోనా అనే గ్రామంలోకి పెద్ద పులి ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక గ్రామంలోకి ప్రవేశించిన పెద్ద పులి.. అక్కడున్న కంపౌండ్ వాల్‌పై ఆరు గంటలపాటు నిద్రించింది. పులి ఉనికిన గమనించిన స్థానికులు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అయితే వారి వచ్చే లోపు పులిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే చుట్టూ ప్రజలు ఉన్న పెద్దపులి వారిపై దాడి చేయకుండా గోడపైనే ఉండిపోయింది. అక్కడకు వచ్చిన ఫారెస్ట్ అధికారులు గోడ చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అనంతరం పులికి మత్తు మందు ఇచ్చి అక్కడి నుంచి తరలించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. 

Also Read: Trending today: RRRలో ఎన్టీఆర్, చరణ్ ఎలా కొట్టుకున్నారో.. ఈ వీడియోలో రైనో, ఏనుగు అలా కొట్టుకున్నాయి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News