Horrible video: ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో... చూస్తే కొన్ని సెకన్ల పాటు గుండె ఆగటం ఖాయం!
ఒక స్నేక్ స్నాచర్ ఒక పామును పట్టడానికి ప్రయత్నించాడు... ఇంకేం ఉంది ఆ పామును చూసి అక్కడే..... చూస్తే కానీ మీకు అర్థం కాదు ఆ వీడియోలో ఏముందో...?? పాములంటే భయం ఉన్న వాళ్లు ఈ వీడియో చూడకపోవటం మంచిది.
పాముని చూసి ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతుంటారు అది సర్వ సాధారణమే. పాములు పట్టే వ్యక్తి (snake Snatcher) కూడా వాటిని పట్టేపుడు చాలా జాగ్రత్తగా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. కానీ పాములకు రారాజు అయినట్టి కింగ్ కోబ్రాను (King Cobra) పట్టుకోవాలంటే స్నేక్ స్నాచర్ కూడా భయంతో వణికిపోతుంటాడు.
ఎందుకంటే.. కింగ్ కోబ్రా అన్నిటి కన్నా పెద్దదే కాదు, అత్యంత విషపూరితమైనది మరియు చాలా చురుకైనది. దీనిని పట్టేపుడు మీ ద్యాస మొత్తం దాని పైనే ఉండాలి... ఏ మాత్రం అజాగ్రత్త వహించిన దాని కాటుకు బలవ్వల్సిందే... ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో (Viral Video) తెగ వైరలవుతుంది.
Also Read: Pawan Kalyan Craze: సెహ్వాగ్ నోట పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్.. వీడియో వైరల్
అదేంటంటే.. సాధారణంగానే ఒక స్నేక్ స్నాచర్ పామును పట్టుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.. అంతే దాదాపు మనిషి ఎత్తు ఉన్న ఆ కింగ్ కోబ్రా (King Cobra) ఒక్కసారిగా అతడి మీదకు మెరుపు వేగంతో వచ్చి... చూసే సరికి... వీడియో గురించి చెప్పటం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. ఈ వీడియో చూస్తే మీ గుండె కొన్ని సెకన్ల పాటు ఆగిపోవటం ఖాయం...
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (Indian Forest Service) అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. "పాములను ఇలా మాత్రం పట్టకూడదు ముఖ్యంగా కింగ్ కోబ్రా" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలయింది.
Also Read: Pooja Hegde: హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతున్న బుట్ట బొమ్మ..
గత మంగళవారం ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో 2 లక్షలకు పైగా వ్యూస్ , 2 వేలకు పైగా రీట్వీట్ మరియు 13,000 లైక్‌లను పొందింది. ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోయిన, కొంత మంది నవ్వుతూ కామెంట్ చేస్తుంటే, మరి కొంత మంది వారి అభిప్రాయాలను కామెంట్లను చేస్తున్నారు.
ఒకరు " ఆ వ్యక్తికి నిజంగా రెండవ జీవితం వచ్చింది." "ఎవరు ఎవరిని కాపాడుతున్నారు?" అని ఒకరు రాయగా..." సర్ నేను ఈ వీడియోను ఇంతకు ముందు చూశాను. ఇది భయంకరంగా ఉందని మరికరు రాసారు.. ఏది ఏమైనా పాములకు దూరంగా ఉండటం చాలా మంచిది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook