Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో
Viral Video: ట్రైన్ కింద ప్రమాదవశత్తు పడితే ప్రాణాల మాట అటుంచితే.. అసలు గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అవ్వడం ఖాయం. అయితే ఓ మహిళ మాత్రం రైలు కింద పడినా.. ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించి వైరల్ వీడియో చూసేయండి ఇప్పుడే.
Viral Video: కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలకే చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ కొన్ని సార్లు అత్యంత భారీ ప్రమాదం జరిగినా ఆశ్చర్యకరంగా ప్రాణాలతో ఉంటారు. అలాంటి ఘటనే ఇటీవల జరిగింది.
మూర్చపోవడంతో ప్రమాదవశత్తు రైలు కింద పడిన ఓ మహిళ.. ప్రాణాలతో బయటపడటం విశేషం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎక్కడ జరిగిందంటే..
అర్జెంటినాలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది ఈ ఘటన. ఓ రైలు ప్లాట్ఫమ్ మీదకు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫామ్‌పై అంతా దూరంగా నిలుచున్నారు. ఆ జనాల మధ్యలో ఉన్న ఓ మహిళ మార్చపోయి.. ప్రమాదవశత్తు రైలు వైపు వెళ్లింది. అక్కడున్నవాళ్లు అమెకు ఏదో జరిగిందని గుర్తించేలోపే.. అమె ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. అయితే ట్రైన్ ఆగిన తర్వాత.. అక్కడున్న వాళ్లంతా ఆమెను ట్రైన్ ట్రాక్ నుంచి పైకి లాగారు. అదృష్టవశత్తు అమె ప్రాణాలతో ఉండటంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెకి చిన్న చిన్న గాయాలు కావడంతో హుటా హుటినా ఆస్పత్రికి తరలించారని న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది.
ఈ దృష్యాలన్నీ ఆ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ ఘటన మార్చి 29న జరిగినట్లు తెలిసింది. కాగా ఇందుకు సంబందించిన సీసీటీవీ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ట్రైన్ కింద పడినా ప్రాణాలతో బయటపడంతో.. చాలా మంది అదృష్టం అంటే ఇదే అంటూ అమె గురించి చర్చించుకుంటున్నారు. మరి ఆ వీడియోను మీరు చూసేయండి ఇప్పుడే.
Also read: Charging Tips: మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఈ టిప్స్ పాటించండి
Also read: Python attacks Baby Cow: ఆవుదూడను ఆ కొండ చిలువ మింగేసిందా ? ఆ తరువాత ఏం జరిగింది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook