Python attacks Baby Cow: ఆవుదూడను ఆ కొండ చిలువ మింగేసిందా ? ఆ తరువాత ఏం జరిగింది ?

Python attacks Baby Cow: ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భారీ కొండ చిలువ ఆవుదూడను మింగేందుకు చేస్తున్న ప్రయత్నం. ఆ తరువాత ఏమైంది

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2022, 09:30 AM IST
  • సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కొండ చిలువ ఆవుదూడ వీడియో
  • ఆవుదూడపై దాడి చేసి మింగేందుకు ప్రయత్నించిన కొండ చిలువ
  • తప్పించుకునేందుకు ఆవుదూడ ప్రయత్నం, ఆ తరువాత ఏమైంది
Python attacks Baby Cow: ఆవుదూడను ఆ కొండ చిలువ మింగేసిందా ? ఆ తరువాత ఏం జరిగింది ?

Python attacks Baby Cow: ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భారీ కొండ చిలువ ఆవుదూడను మింగేందుకు చేస్తున్న ప్రయత్నం. ఆ తరువాత ఏమైంది

పాములంటే అందరికీ భయమే. చూస్తుంటే ఒళ్లంతా కంపరంతో పాటు భయం కలుగుతుంది. చిన్నవైవా పెద్దవైనా సరే భయం గొలుపుతాయి. ఇప్పుుడు సోషల్ మీడియాలో అటువంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆవుదూడపై కొండ చిలువ దాడి చేయడం చూడవచ్చు. భారీ కొండ చిలువ ఆవుదూడను మింగేందుకు చేస్తున్న ప్రయత్నమిది. 

దాదాపు పది అడుగులు పొడుగున్న భారీ కొండ చిలువ ఆవుదూడలున్న ఓ ఫామ్‌లో ప్రవేశిస్తుంది. కొండచిలువను చూసి మిగిలిన దూడలు పరుగులంకించుకుంటాయి. కానీ ఓ ఆవుదూడ కాలిని పట్టుకుంటుంది కొండ చిలువ. దాంతో ఆ ఆవుదూడ అర్చుకుంటూ ముందుకు పరుగులెడుతుంటుంది. కొండ చిలువ మాత్రం పట్టిన పట్టు వదలకుండా అలాగే ఉంటుంది. ఆవుదూడ ప్రాణభయంతో పెట్టే అరుపులు అందర్నీ కలచివేస్తున్నాయి. కొండ చిలువ కాలిని పట్టుకోవడంతో కష్టంగా పరుగెడుతుంటుంది. ఈ వీడియోలో అంతవరకే ఉంది. కొండ చిలువను తప్పించుకుని ఆవుదూడ పారిపోగలిగిందా లేదా అనేది తెలియదు. లేదా కొండ చిలువ ఆవుదూడని మింగేసిందా..ఏం జరిగింది. ఇదే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ఉత్సుకత కల్గిస్తుంది. అమాయక ఆవుదూడపై జాలి కలుగుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

ఈ వీడియో సహజంగానే వైరల్ అవుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాపై నెటిజన్లు మండిపడుతున్నారు వీడియో తీసిన వ్యక్తిపై. సహాయం చేయాల్సింది పోయి..వీడియో తీస్తున్నావా అంటూ విమర్శలు అందుకున్నారు. మరి కొద్దిమందైతే ఆ పాము చచ్చిపోయుంటుంది లేదా చుట్టుపక్కలవాళ్లు కొట్టడంతో పారలైజ్ అయుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమందైతే అది నిజమైన పాము కాదని కూడా అంటున్నారు. 

Also read: Viral News: పెరిగిన నిమ్మకాయ, ఎండుమిర్చి ధరలు.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News