Viral Video: Boy Comes Up With Crazy idea to Take Hot Bath Outside During Winter Watch the video : ప్రస్తుతం చలి చంపేస్తుంది. గజగజ వణికిస్తోంది. అబ్బా ఇదేమీ చలిరా బాబోయ్ అనుకుంటున్నారు అంతా. ఇక ఈ చలిలో (Winter) స్నానం చేయాలంటే గజగజ వణకాల్సి వస్తుంది. బాగా వేడిగా ఉన్న నీటితో (Hot water) అయితే స్నానం చేయాలని అనిపిస్తుంటుంది. కాస్త వేడి తగ్గినా మళ్లీ వణికిపోవాల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి నీళ్లు వేడి తగ్గకుండా స్నానం (Bath) చెయ్యాలంటే కూడా కాస్త కుదరని పనే. అయితే ఒక అబ్బాయి మాత్రం చలిలో కూడా ఫుల్ వేడి నీటితో స్నానం చేసేందుకు కొత్త పద్ధతి పాటించాడు. వేడి నీటిని బకెట్‌లో పోసుకుని స్నానం చేస్తే ఫలితం లేదనుకున్నట్లున్నాడు.. ఏకంగా పొయ్యిపైనే కూర్చొని స్నానం చేయడం మొదలు పెట్టాడు. 


పొయ్యిపై ఒక పెద్ద పాత్ర (కడాయి) పెట్టి.. అందులో నీళ్లను నింపి కింద మంట పెట్టేశాడు. తర్వాత వెళ్లి ఆ వేడి నీటి పాత్రలో కూర్చొన్నాడు. ఎంచక్కా.. కావాల్సినంత సేపు అలా అందులోనే కూర్చొని స్నానం చేస్తూ ఉండిపోయాడు. ఒక వైపు పాత్ర కింద భగభగ మంట మండుతోంది. పాత్రలో ఉన్న నీటిలో ఆ అబ్బాయి వేడి నీటితో స్నానం చేస్తూ కూర్చొన్నాడు.




 


Also Read : Harbhajan Singh: రాజకీయాల్లోకి ఎంట్రీపై భజ్జీ క్లారిటీ- సిద్ధూను కలిసింది ఎందుకంటే?


సోషల్ మీడియాలో (Social media) ఈ వీడియో (Video) ఇప్పుడు మస్తు వైరల్ అవుతోంది. అబ్బా ఏమన్నా ట్రిక్‌ ఆ.. ఇది.. అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చలి నుంచి తప్పించుకుంటూ స్నానం చేయొచ్చేమోగానీ ఇది అంత సేఫ్ కాదంటూ కొందరు నెటిజెన్స్ సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం కూడా కాలే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది కాస్త ప్రమాదకరమైనది ఇలాంటి విధానాలు వద్దు అని చెబుతున్నారు. సరదాగా కూడా ఇలా చేయొద్దంటూ సూచిస్తున్నారు.




 


Also Read : BSNL బంపరాఫర్.. అతితక్కువ ధరకే 5జీబీ డైలీ డేటా! వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి పండగే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి