Empty Slip From ATM Centre: సోషల్ మీడియాలో ప్రతిరోజు లకల కొద్ది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. మెయిన్ గా పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు వార్తలలో ఉంటాయి. పెళ్లిలో కొన్నిసార్లు ఫన్నీ ఘటనలు జరుగుంటాయి. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తారో, మరేంటో గానీ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇలాంటి వైరల్ కంటెంట్ , రీల్స్ వల్ల కొందరు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కలలో కూడా కొందరు ఊహించని విధంగా పాపులారిటీ వచ్చి పడుతుంది. కొన్నిసార్లు సరదాగా చేసిన పనులు కూడా వైరల్ గా మారుతుంటాయి. అచ్చం ఇలాంటి ఒక ఫన్నీ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇద్దరు యువకులు ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బుల కోసం ప్రయత్నించారు. అప్పుడు.. వాళ్ల అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండటంతో, డబ్బులు రావు. జీరో బ్యాలెన్స్ అని స్లిప్ వస్తుంది. అయితే.. ఇద్దరు యువకులు కాస్త వెరైటీగా ఐడియా వేశారు. ఆ స్లిప్ లతో తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేశారు.


పలుమార్లు ఏటీఎం కార్డులను స్వైప్ చేసి, వచ్చిన ఎంప్టీ స్లిప్ ను కలెక్ట్ చేశారు. వీటిని ఒక పాత న్యూస్ పేపర్ తీసుకునే దుకాణంకు తీసుకెళ్లారు. స్లిపుల కట్టలను తీసుకుని  వీళ్లకు ఒక ఇరవై రూపాయలు మాత్రం ఇచ్చాడు. దీంతో ఇద్దరు యువకులు టీ స్టాల్ కు వెళ్లి తమకు కావాల్సిన టెస్టీ చాయ్ కోనుగోలు చేసి, ఫుల్ ఎంజాయ్ చేశారు.


Read More: Pooja Hegde Saree Pics: చీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..


ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. మీది మాములు బుర్ర కాదు బ్రో అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు. 




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook